ఉపోద్ఘాతం
"ఈ భూగోళం మనిషికి మాత్రమే) చెందినది కాదు. మనిషే ఈ
భూగోళానికి చెందుతాడు. ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే ఒకే రక్తం
లాగా ఈ భూగోళం తనకు చెందిన చరాచరాలకు మధ్య సంబంధాన్ని
కలిపే ఉంచుతుంది.”
- అమెరికాలోని దువామిష్ తెగ నాయకుడి మాట
ఈ పుస్తకాన్ని వ్రాయటానికి నేను కలమూ, కాగితమూ చేత పట్టుకుని కూర్చున్నప్పుడు, నేను నా ఓక్ బ్రూక్ టెర్రేస్ టవర్లోని పద్దెనిమిదవ అంతస్తులోని గవాక్షం ద్వారా పరికిస్తే, చుట్టూరా చికాగో నగర వినువీధుల్లోని ఆకాశ హర్మ్యాలెన్నో కనిపించాయి. నిజానికి ఈ దృశ్యం గత ఏభై అయిదు సంవత్సరాలుగా నేను చూస్తుండగానే పెరుగుతూ, ఆకాశపు తెల్లమబ్బులను అందుకుంటూ, ఈ ప్రపంచంలో మానవుడు సాధించిన, సాధిస్తున్న ఎన్నో విజయాలనూ, వాటిని సాకారం చేసిన ఎన్నో సాంకేతిక అద్భుతాలనూ ప్రస్తావిస్తున్నాయి. గత డెబ్బది అయిదు సంవత్సరాలలో మన ప్రపంచం ఎన్నో రకాలుగా మార్పు చెందింది. ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొంది. జనాభా నాలుగు రెట్లయింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాము. ప్రపంచంలో శాంతి చాలావరకు నెలకొని ఉంది. ఈ సమయంలోనే మౌలిక సదుపాయాలూ పెరిగాయి.
పేదరికం తగ్గు ముఖం పట్టింది. విద్య అనేది అందరికీ అందుబాటుగా విస్తరించింది. సాంకేతిక విజ్ఞానం పరివ్యాప్తమయింది. ఇంకా మనమందరమూ అనుసంధానించ బడ్డాం.
ఉపోద్ఘాతం "ఈ భూగోళం మనిషికి మాత్రమే) చెందినది కాదు. మనిషే ఈ భూగోళానికి చెందుతాడు. ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే ఒకే రక్తం లాగా ఈ భూగోళం తనకు చెందిన చరాచరాలకు మధ్య సంబంధాన్ని కలిపే ఉంచుతుంది.” - అమెరికాలోని దువామిష్ తెగ నాయకుడి మాట ఈ పుస్తకాన్ని వ్రాయటానికి నేను కలమూ, కాగితమూ చేత పట్టుకుని కూర్చున్నప్పుడు, నేను నా ఓక్ బ్రూక్ టెర్రేస్ టవర్లోని పద్దెనిమిదవ అంతస్తులోని గవాక్షం ద్వారా పరికిస్తే, చుట్టూరా చికాగో నగర వినువీధుల్లోని ఆకాశ హర్మ్యాలెన్నో కనిపించాయి. నిజానికి ఈ దృశ్యం గత ఏభై అయిదు సంవత్సరాలుగా నేను చూస్తుండగానే పెరుగుతూ, ఆకాశపు తెల్లమబ్బులను అందుకుంటూ, ఈ ప్రపంచంలో మానవుడు సాధించిన, సాధిస్తున్న ఎన్నో విజయాలనూ, వాటిని సాకారం చేసిన ఎన్నో సాంకేతిక అద్భుతాలనూ ప్రస్తావిస్తున్నాయి. గత డెబ్బది అయిదు సంవత్సరాలలో మన ప్రపంచం ఎన్నో రకాలుగా మార్పు చెందింది. ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొంది. జనాభా నాలుగు రెట్లయింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాము. ప్రపంచంలో శాంతి చాలావరకు నెలకొని ఉంది. ఈ సమయంలోనే మౌలిక సదుపాయాలూ పెరిగాయి. పేదరికం తగ్గు ముఖం పట్టింది. విద్య అనేది అందరికీ అందుబాటుగా విస్తరించింది. సాంకేతిక విజ్ఞానం పరివ్యాప్తమయింది. ఇంకా మనమందరమూ అనుసంధానించ బడ్డాం.© 2017,www.logili.com All Rights Reserved.