భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతరులు కలుగజేసుకోవడం న్యాయం కాదని చాలామంది అంటారు. కానీ, న్యాయం కూడా తమ విషయంలో జోక్యం చేసుకోదని ఆమెకి అప్పటికింకా తెలియదు.
ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని నమ్మి, ఆమె ఆ న్యాయస్థానం మెట్లు ఎక్కి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి.
ఆ రోజు చివరి రోజు. న్యాయమూర్తి చివరి తీర్పు వినిపించే రోజు. కొడిగడుతున్న ఆశను కూడదీసుకుని, కోర్టుకు బయలుదేరడానికి సిద్ధమవుతోందామె.
అరచేయంత లంచ్ బాక్స్ ని అరగంజమంత వెడల్పయిన హ్యాండ్ బ్యాగులో పెట్టుకుంది. అదే బ్యాగ్కి వున్న మరో అరలో ఏవేవో కాగితాలు, కార్డులను వేళ్లతో జరుపుతూ, కళ్లతో పరీక్షించి అన్నీ వున్నాయని నిర్ధారించుకుంది. హడావిడిగా తాళం కప్ప తీసుకుని గబగబా గుమ్మం దాకా వెళ్లాకా, దేవుడు గుర్తొచ్చాడు. దాంతో అంతే వేగంగా వంటింట్లోకి వచ్చి, ఓ మూల చెక్క షెల్ఫ్ లో అమర్చిన పటాలకు- మామూలుగా కంటే కాస్త గట్టిగా నమస్కారం పెట్టుకుంది.
తాళం వేసి, బయటకు వచ్చి రోడ్డు మీద హడావిడిగా నడుస్తూ 'ఎన్ని దణ్నాలు పెట్టినా, అదేంటో.. ఆ మాయదారి దేవుడు మగాడివైపే నిలబడుతూ వున్నాడు. అవున్లే ఎంతైనా ఆయనా మగాడే కదా' అనుకుంది. ఇంతలో షేర్ ఆటో వాడు పక్కకు వచ్చి, స్లో చేసి ప్రశ్నార్థకంగా చూడటంతో.. నడవాల్సిన దూరం తగ్గినందుకు సంతోషిస్తూ ఎక్కి కూర్చుంది. అప్పుడు ఆమె మనసు కాస్త స్థిమిత పడింది. మనుషులు కనబడితే చాలు, ఆటో ఆగుతోంది. వాళ్లని ఎక్కించుకునిగానీ ముందుకు కదలడం లేదు. కావాల్సినంత మంది ఎక్కాక.. రోడ్డు మీద వాళ్లు చేయి చూపించినా, ఆపకుండా వాయు వేగంతో సాగిపోయింది.
ఒకప్పుడు ఆ కోర్టు ఊళ్లోనే ఉండేది. మాల్స్, మల్టీప్లెక్స్ ల మధ్య ఇరుగ్గా వుంటుందనేమో, శివార్లలో విశాలంగా కట్టారు. ఈ ఆటోల్లో పోయేవారంతా అక్కడున్న అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారే. మనుషుల్ని కా రోడ్లు, భవనాలైనా అభివృద్ధి చేయాలని ఏలినవారు భావించడంతో, ఊరి చివర.............................
భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతరులు కలుగజేసుకోవడం న్యాయం కాదని చాలామంది అంటారు. కానీ, న్యాయం కూడా తమ విషయంలో జోక్యం చేసుకోదని ఆమెకి అప్పటికింకా తెలియదు. ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని నమ్మి, ఆమె ఆ న్యాయస్థానం మెట్లు ఎక్కి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఆ రోజు చివరి రోజు. న్యాయమూర్తి చివరి తీర్పు వినిపించే రోజు. కొడిగడుతున్న ఆశను కూడదీసుకుని, కోర్టుకు బయలుదేరడానికి సిద్ధమవుతోందామె. అరచేయంత లంచ్ బాక్స్ ని అరగంజమంత వెడల్పయిన హ్యాండ్ బ్యాగులో పెట్టుకుంది. అదే బ్యాగ్కి వున్న మరో అరలో ఏవేవో కాగితాలు, కార్డులను వేళ్లతో జరుపుతూ, కళ్లతో పరీక్షించి అన్నీ వున్నాయని నిర్ధారించుకుంది. హడావిడిగా తాళం కప్ప తీసుకుని గబగబా గుమ్మం దాకా వెళ్లాకా, దేవుడు గుర్తొచ్చాడు. దాంతో అంతే వేగంగా వంటింట్లోకి వచ్చి, ఓ మూల చెక్క షెల్ఫ్ లో అమర్చిన పటాలకు- మామూలుగా కంటే కాస్త గట్టిగా నమస్కారం పెట్టుకుంది. తాళం వేసి, బయటకు వచ్చి రోడ్డు మీద హడావిడిగా నడుస్తూ 'ఎన్ని దణ్నాలు పెట్టినా, అదేంటో.. ఆ మాయదారి దేవుడు మగాడివైపే నిలబడుతూ వున్నాడు. అవున్లే ఎంతైనా ఆయనా మగాడే కదా' అనుకుంది. ఇంతలో షేర్ ఆటో వాడు పక్కకు వచ్చి, స్లో చేసి ప్రశ్నార్థకంగా చూడటంతో.. నడవాల్సిన దూరం తగ్గినందుకు సంతోషిస్తూ ఎక్కి కూర్చుంది. అప్పుడు ఆమె మనసు కాస్త స్థిమిత పడింది. మనుషులు కనబడితే చాలు, ఆటో ఆగుతోంది. వాళ్లని ఎక్కించుకునిగానీ ముందుకు కదలడం లేదు. కావాల్సినంత మంది ఎక్కాక.. రోడ్డు మీద వాళ్లు చేయి చూపించినా, ఆపకుండా వాయు వేగంతో సాగిపోయింది. ఒకప్పుడు ఆ కోర్టు ఊళ్లోనే ఉండేది. మాల్స్, మల్టీప్లెక్స్ ల మధ్య ఇరుగ్గా వుంటుందనేమో, శివార్లలో విశాలంగా కట్టారు. ఈ ఆటోల్లో పోయేవారంతా అక్కడున్న అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారే. మనుషుల్ని కా రోడ్లు, భవనాలైనా అభివృద్ధి చేయాలని ఏలినవారు భావించడంతో, ఊరి చివర.............................© 2017,www.logili.com All Rights Reserved.