ఉపక్రమము
“అమదం ప్పాకద కవ్వం"
(అమృతమ్ ప్రాకృత కావ్యమ్)
-శారనేనీ
“అమిఅం పాఇఆ కవ్వం"
(అమృతమ్ ప్రాకృత కావ్యమ్)
-మహరాష్ట్ర
ప్రాకృతాం గ్రథితాగాథాః సాతవాహన భూభుజా! |
వ్యథుః ధృతేత్తు విస్తారం అహో చిత్రపరమ్పరాః||
(ప్రాకృత భాషలో హాలసాతవాహనరాజు సంకలించిన గాథలు మిక్కిలి చమత్కార ధ్వనిభరితములై పఠితలకు మహానందమును కలిగించుచున్నవి.)
-రాజశేఖరః
అవినాశనమగ్రామ్యమ్ అకరోత్ సాతవాహనః!
విశుద్ధజాతిభిః కోశమ్ రత్నైరివ సుభాషితైః||
(హాల సాతవాహనుడు జాతిరత్నముల వంటి పద్యములచేత నాశనములేని, దుష్టముకాని గాథాకోశమును నిర్మించెను.)
-బాణభట్టు
బాణభట్టు ప్రశంసను పట్టి నేటి గాథాసప్తశతి పూర్వపు పేరు గాథాకోశం. ఆచార్యదణ్ణి కావ్యలక్షణమ్ అనబడే కావ్యాదర్శమ్ 1-13లో 'కోశ' పదమును ప్రదర్శించినాడు. దాని వ్యాఖ్యాత వాదిగంఘాలుడు (నిజనామము ముంజార్య) కోశపదమును వివరిస్తూ 'కోశో నానాకర్తృక సుభాషిత రత్నసమూహః' అని చెప్పాడు. ఇక్కడ సుభాషితము అనగా పద్యము / శ్లోకము అనియే అర్ధము. అంతేకాక | 'కోశోరి వ్యనేక భిన్నార్రగాథా గ్రథితః గాథాకోశః, కృష్ణసారః, తారాగణః ఇతి' అని మనకు తెలియని కృష్ణసారకోశం, తారాగణకోశం ప్రస్తావనలు తెచ్చినాడు. కృష్ణసారం గురించి నేటికీ తెలియదు. కాని తారాగణకోశం గురించి కొంతకు కొంత తెలుసుంది.............
© 2017,www.logili.com All Rights Reserved.