పగలంతా చాలా కష్టపడ్డాడనుకుంటా.
ఈరోజు కొంచెం త్వరగానే తిరుగుముఖం పట్టాడు.
పడమటి ఆకాశాన తన ఇల్లనుకుంటా.
అటువైపుకి వాలిపోతూ ఉన్నాడు.
మొత్తానికి స్కూల్ అయిపోగానే ఆనందంతో ఇంటికి పరిగెత్తే పిల్లాడిలా ఉన్నాడు, అస్తమయం పూట ఆ సూర్యుడు.
విశాఖపట్నం. సమయం సాయంత్రాన్ని చేరుకుంది. సాయంత్రం సూర్యుని రంగుని పూసుకుని సొగసుగా మారింది. ఆ కాషాయపు కాంతిరేఖలు తెరిచి ఉన్న బాల్కనీ గుండా ప్రసరిస్తూ చీకటి గదిలో, చారల కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న అశోక్ నందన్పై పడ్డాయి. ఎవరో తట్టిలేపినట్టు అనిపించి చిన్నగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
బహుశా రవి పడుకునేప్పుడు కవి మేలుకుంటాడు కాబోలు.! ఒరిగిన కుర్చీవి. చెదిరిన జుట్టుని సరిచేసుకుని సూర్యాస్తమయాన్ని చూస్తూ పక్కనే ఉన్న స్కెచ్ పెన్ తీసుకొని తాను రాయబోయే కొత్త నవలకి టైటిల్ రాశాడు...................
పగలంతా చాలా కష్టపడ్డాడనుకుంటా. ఈరోజు కొంచెం త్వరగానే తిరుగుముఖం పట్టాడు. పడమటి ఆకాశాన తన ఇల్లనుకుంటా. అటువైపుకి వాలిపోతూ ఉన్నాడు. మొత్తానికి స్కూల్ అయిపోగానే ఆనందంతో ఇంటికి పరిగెత్తే పిల్లాడిలా ఉన్నాడు, అస్తమయం పూట ఆ సూర్యుడు. విశాఖపట్నం. సమయం సాయంత్రాన్ని చేరుకుంది. సాయంత్రం సూర్యుని రంగుని పూసుకుని సొగసుగా మారింది. ఆ కాషాయపు కాంతిరేఖలు తెరిచి ఉన్న బాల్కనీ గుండా ప్రసరిస్తూ చీకటి గదిలో, చారల కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న అశోక్ నందన్పై పడ్డాయి. ఎవరో తట్టిలేపినట్టు అనిపించి చిన్నగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. బహుశా రవి పడుకునేప్పుడు కవి మేలుకుంటాడు కాబోలు.! ఒరిగిన కుర్చీవి. చెదిరిన జుట్టుని సరిచేసుకుని సూర్యాస్తమయాన్ని చూస్తూ పక్కనే ఉన్న స్కెచ్ పెన్ తీసుకొని తాను రాయబోయే కొత్త నవలకి టైటిల్ రాశాడు...................© 2017,www.logili.com All Rights Reserved.