లంకెల ముచ్చుల పాలిట.... శిలకోల!
మిత్రుడు, జగదీశ్ తన కథలను ఒక ఫైల్ చేసి, యిస్తూ, శిలకోల పేరుతో సంపుటిగా తేవాలనుకుంటున్నాను, మీరొక మాట రాయాలని కోరేడు. (మరికొందరు పెద్దలనూ తలా ఒక మాట రాయమని, పెద్దల ఆశీర్వాదాన్ని కోరుతున్నట్టు చెప్పాడు) జగదీశ్ కథల ప్రతిని తీసుకుని, దాదాపు పదిహేను రోజుల తర్వాత, చదవడానికి పూనుకున్నాను. "శిలకోల" పేరు చదవగానే, నా మనసు ముప్పయ్యదేళ్ళ వెనకకు పోయింది. ఎందుకో, ఒక్కసారిగా... “ఎహెం, ఒహెం ఎయ్యరా... ఎదురుకర్ర తియ్యిరా... తిరగబడీ తీరందే జరుగుబడీ నేదురా.... వంగపండు పాట గుర్తుకొచ్చింది. ఆ పాటలోని ఆఖరి చరణాలు....“లంకెల ముచ్చుల పాల అవ్వర నువ్ శిలకోల...” మనసులో కదిలేయి. బహుశా, ఒక ఆవాహనతో..... వంగపండూ, భూషణం, మేరంగి మిత్రులూ, పార్వతీపురం ప్రాంత విప్లవాభిమానులు, మేమంతా..... తిరుగుబాటు గురించి కలలుగన్న కాలమది. కలలు కనడమే కాదు, కలల సాఫల్యం కోసం, చేతనయినమేరకు నడచిన కాలమది! జననాట్యమండలి ప్రదర్శనలూ, నంది నాటకం, కథా, నవలా... ఆటా పాటా విప్లవోత్తేజ ప్రభంజన తరుణమది!
బహుశా, అప్పటికి జగదీశ్, రెండుమూడేళ్ళ వయసువాడై వుంటాడు. పాలుదాగే, పసి బాలుడయి వుంటాడు. ఆ పాటగానీ, ఆ పాటలో చెప్పిన తిరుగుబాటు గానీ, ఆ ప్రభంజనంగానీ, ఆ విప్లవోత్తేజం గానీ, జగదీశ్ కి తెలిసుండవు. నిజానికి, వంగపండు ఆ పాట రాసీ, పాడుతున్న కాలానికే... తిరుగుబాటు... విఫలమైంది. (తిరుగుబాటంటే... విప్లవమే... కవి, అర్థమదే) పోరాటనాయకులూ, ప్రజలూ, చాలామంది అమరులవడమో, అరెస్టుకాబడడమే జరిగింది. అడవి నెత్తురుగక్కింది. ఆదివాసీ బతుకు... బలుసాకు వెతుకులాటయ్యింది! ఎక్కడో, అక్కడక్కడా.... విప్లవగాలులు..... అడవుల్లోకంటే... పల్లెల్లో అజ్ఞాతంగా వీచేవి... గానీ, అవి అంతటా వీస్తున్నాయని అనుకునే రోజులవి. గనకనే, భూషణం గారు- 'కొండగాలి' నవలా, అడవంటుకుంది, ఇదేదారి, పులుసు.... వంటి కొన్ని కథలూ రాసేరు. దాదాపు, నేను గూడా.... ఎనభైలల్లో కథారచన ఆరంభించి గూడా.......................
లంకెల ముచ్చుల పాలిట.... శిలకోల! మిత్రుడు, జగదీశ్ తన కథలను ఒక ఫైల్ చేసి, యిస్తూ, శిలకోల పేరుతో సంపుటిగా తేవాలనుకుంటున్నాను, మీరొక మాట రాయాలని కోరేడు. (మరికొందరు పెద్దలనూ తలా ఒక మాట రాయమని, పెద్దల ఆశీర్వాదాన్ని కోరుతున్నట్టు చెప్పాడు) జగదీశ్ కథల ప్రతిని తీసుకుని, దాదాపు పదిహేను రోజుల తర్వాత, చదవడానికి పూనుకున్నాను. "శిలకోల" పేరు చదవగానే, నా మనసు ముప్పయ్యదేళ్ళ వెనకకు పోయింది. ఎందుకో, ఒక్కసారిగా... “ఎహెం, ఒహెం ఎయ్యరా... ఎదురుకర్ర తియ్యిరా... తిరగబడీ తీరందే జరుగుబడీ నేదురా.... వంగపండు పాట గుర్తుకొచ్చింది. ఆ పాటలోని ఆఖరి చరణాలు....“లంకెల ముచ్చుల పాల అవ్వర నువ్ శిలకోల...” మనసులో కదిలేయి. బహుశా, ఒక ఆవాహనతో..... వంగపండూ, భూషణం, మేరంగి మిత్రులూ, పార్వతీపురం ప్రాంత విప్లవాభిమానులు, మేమంతా..... తిరుగుబాటు గురించి కలలుగన్న కాలమది. కలలు కనడమే కాదు, కలల సాఫల్యం కోసం, చేతనయినమేరకు నడచిన కాలమది! జననాట్యమండలి ప్రదర్శనలూ, నంది నాటకం, కథా, నవలా... ఆటా పాటా విప్లవోత్తేజ ప్రభంజన తరుణమది! బహుశా, అప్పటికి జగదీశ్, రెండుమూడేళ్ళ వయసువాడై వుంటాడు. పాలుదాగే, పసి బాలుడయి వుంటాడు. ఆ పాటగానీ, ఆ పాటలో చెప్పిన తిరుగుబాటు గానీ, ఆ ప్రభంజనంగానీ, ఆ విప్లవోత్తేజం గానీ, జగదీశ్ కి తెలిసుండవు. నిజానికి, వంగపండు ఆ పాట రాసీ, పాడుతున్న కాలానికే... తిరుగుబాటు... విఫలమైంది. (తిరుగుబాటంటే... విప్లవమే... కవి, అర్థమదే) పోరాటనాయకులూ, ప్రజలూ, చాలామంది అమరులవడమో, అరెస్టుకాబడడమే జరిగింది. అడవి నెత్తురుగక్కింది. ఆదివాసీ బతుకు... బలుసాకు వెతుకులాటయ్యింది! ఎక్కడో, అక్కడక్కడా.... విప్లవగాలులు..... అడవుల్లోకంటే... పల్లెల్లో అజ్ఞాతంగా వీచేవి... గానీ, అవి అంతటా వీస్తున్నాయని అనుకునే రోజులవి. గనకనే, భూషణం గారు- 'కొండగాలి' నవలా, అడవంటుకుంది, ఇదేదారి, పులుసు.... వంటి కొన్ని కథలూ రాసేరు. దాదాపు, నేను గూడా.... ఎనభైలల్లో కథారచన ఆరంభించి గూడా.......................© 2017,www.logili.com All Rights Reserved.