అక్టోబరు 12-16, 2017లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రపంచ కవుల పండుగ- Pentasi-B - India World Poetree Festival ను నిర్వహించినపుడు Yaw-Chien Fang తో పరిచయ భాగ్యం కలిగింది. ఎంతో నెమ్మదిగా, ప్రశాంతంగా కనిపించే ఫాంగ్ ఒక విశ్రాంత అగ్నిపర్వతం లాంటివాడని ఈ పుస్తకం చదువుతున్నపుడు అనిపించింది నాకు.
అనేక దేశాలలో మూలవాసులపై అభివృద్ధి చెందిన మానవ తెగలు విరుచుకుపడగా వాళ్లు చేసే అస్తిత్వ పోరాటాలు మనకు తెలుసు. తైవాన్లోని సిరయా తెగవాళ్ల మనోభావాలు మనకు 'ఫాంగ్' వాక్యాలలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఎక్కడో మనసులో ఏదో అనిర్వచనీయమైన దుఃఖభావం మనల్ని కలచివేస్తుంది. అప్రయత్నంగా కొన్ని కన్నీటి బొట్లు జాలువారతాయి. ఏదో తెలియని దిగులు.
అన్న కన్నీటిబొటన దుఃఖభావటినట్లు
తెయెవన్ అనేది సిరయా తెగలో ఒక గుంపు పేరు. ఆస్ట్రోనేషియన్ జాతికి చెందిన వీరు అదృశ్యమైన తెగలలో ఒకరిగా పరిగణించబడున్నారు.
"Tayouan Paipai" (తెయెవన్ పై పై) అంటే Tayouan girl - తెయెవన్ ఆడపిల్ల లేక ఆడపడుచు. ఈ కవిత్వ సంకలనంలోని కవితలు సిరయా ప్రజల ధర్మాగ్రహాన్ని, ప్రేమ, ద్వేషం, ప్రతిఘటనలను తెలియజేస్తాయి.
సిరయా (Siraya) ప్రజల చరిత్రను సవివరంగా తెలియజేసే ఈ ను raw-Chien Fang తైవానీస్-సిరయా భాషలో వ్రాయగా Chuanan yang ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ పుస్తకం ఆధారంగా నేను ఈ అనువాదం చేయగలిగాను. ఇరువురికి నా కృతజ్ఞతలు.
సృజన లోకం పక్షాన నేను వ్రాస్తున్న 120వ పుస్తకం - "తైవాన్ ఆడపడుచు. మా అన్ని గ్రంథాలను విశేషంగా ఆదరిస్తున్న తెలుగు సాహిత్యం పంచి ఈ ప్రయత్నాన్ని గౌరవించి అక్కున చేర్చుకుంటుందని విశ్వసిస్తూ...
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
అక్టోబరు 12-16, 2017లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రపంచ కవుల పండుగ- Pentasi-B - India World Poetree Festival ను నిర్వహించినపుడు Yaw-Chien Fang తో పరిచయ భాగ్యం కలిగింది. ఎంతో నెమ్మదిగా, ప్రశాంతంగా కనిపించే ఫాంగ్ ఒక విశ్రాంత అగ్నిపర్వతం లాంటివాడని ఈ పుస్తకం చదువుతున్నపుడు అనిపించింది నాకు. అనేక దేశాలలో మూలవాసులపై అభివృద్ధి చెందిన మానవ తెగలు విరుచుకుపడగా వాళ్లు చేసే అస్తిత్వ పోరాటాలు మనకు తెలుసు. తైవాన్లోని సిరయా తెగవాళ్ల మనోభావాలు మనకు 'ఫాంగ్' వాక్యాలలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఎక్కడో మనసులో ఏదో అనిర్వచనీయమైన దుఃఖభావం మనల్ని కలచివేస్తుంది. అప్రయత్నంగా కొన్ని కన్నీటి బొట్లు జాలువారతాయి. ఏదో తెలియని దిగులు. అన్న కన్నీటిబొటన దుఃఖభావటినట్లు తెయెవన్ అనేది సిరయా తెగలో ఒక గుంపు పేరు. ఆస్ట్రోనేషియన్ జాతికి చెందిన వీరు అదృశ్యమైన తెగలలో ఒకరిగా పరిగణించబడున్నారు. "Tayouan Paipai" (తెయెవన్ పై పై) అంటే Tayouan girl - తెయెవన్ ఆడపిల్ల లేక ఆడపడుచు. ఈ కవిత్వ సంకలనంలోని కవితలు సిరయా ప్రజల ధర్మాగ్రహాన్ని, ప్రేమ, ద్వేషం, ప్రతిఘటనలను తెలియజేస్తాయి. సిరయా (Siraya) ప్రజల చరిత్రను సవివరంగా తెలియజేసే ఈ ను raw-Chien Fang తైవానీస్-సిరయా భాషలో వ్రాయగా Chuanan yang ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ పుస్తకం ఆధారంగా నేను ఈ అనువాదం చేయగలిగాను. ఇరువురికి నా కృతజ్ఞతలు. సృజన లోకం పక్షాన నేను వ్రాస్తున్న 120వ పుస్తకం - "తైవాన్ ఆడపడుచు. మా అన్ని గ్రంథాలను విశేషంగా ఆదరిస్తున్న తెలుగు సాహిత్యం పంచి ఈ ప్రయత్నాన్ని గౌరవించి అక్కున చేర్చుకుంటుందని విశ్వసిస్తూ... - డాక్టర్ లంకా శివరామప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.