జీవితాన్ని ఆలింగనం చేసుకునే కవిత్వం
- డా|| నందిని సిధారెడ్డి
తెలంగాణ సాహిత్య అకాడమి, తొలి అధ్యక్షులు జీవితంలో సంభవించే అనేకానేక పరిణామాలు కవి హృదయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. విచలితమై పోయి హృదయం ఉద్వేగంగా పలికిన మాటల పరంపరే కవిత్వం. కాలం బహుచిత్రమైంది. మనుషులకు పరీక్షలు పెడుతుంటుంది. కవులు పరీక్షలో తట్టుకోవటానికి పదాలు వెతుక్కుంటుంటారు. క్షుభిత సమయంలో ఉబికిన భావాల వెల్లువ కవిత్వంగా భాసిస్తుంది. కష్టాలు కావచ్చు. కన్నీళ్లు పెట్టించే కల్లోలాలు కావచ్చు. కాటకాలు కావచ్చు. చివరకు కరోనా కావచ్చు. మానవ సమాజాన్ని క్షోభపెట్టిన కాల పరీక్షలే. సందర్భాన్నిబట్టి సున్నిత హృదయులైన కవులు తమతమ అక్షరాస్త్రాల్ని సంధించటం, జాతిని సాంత్వన పర్చటం చరిత్ర మరిచిపోలేని ఉద్విగ్నఘట్టాలుగా గుర్తింపు పొందుతాయి.
జరుగుతున్న పరిణామాలకు కరిగిపోయి, మరిగిపోయి అవతరించిన కవి సోమశిల తిరుపాల్. తన హృదయాన్ని కలచివేసిన క్షణాలను కవితానుయంగా మలిచి, రూపొందించిన సంపుటి 'తరమెల్లిపోతుంది'. భావావేశం కొంచెం ఎక్కువే. సమూహ జీవనం పట్ల. ప్రగతిశీల దృక్పథం పట్ల మరింత తక్కువ కనుమరుగవుతున్న త్యాగశీల తరంపట్ల ఆవేదన తిరుపాల్ అక్షరాల్లో ప్రతిబింబించింది.......................
జీవితాన్ని ఆలింగనం చేసుకునే కవిత్వం - డా|| నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి, తొలి అధ్యక్షులు జీవితంలో సంభవించే అనేకానేక పరిణామాలు కవి హృదయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. విచలితమై పోయి హృదయం ఉద్వేగంగా పలికిన మాటల పరంపరే కవిత్వం. కాలం బహుచిత్రమైంది. మనుషులకు పరీక్షలు పెడుతుంటుంది. కవులు పరీక్షలో తట్టుకోవటానికి పదాలు వెతుక్కుంటుంటారు. క్షుభిత సమయంలో ఉబికిన భావాల వెల్లువ కవిత్వంగా భాసిస్తుంది. కష్టాలు కావచ్చు. కన్నీళ్లు పెట్టించే కల్లోలాలు కావచ్చు. కాటకాలు కావచ్చు. చివరకు కరోనా కావచ్చు. మానవ సమాజాన్ని క్షోభపెట్టిన కాల పరీక్షలే. సందర్భాన్నిబట్టి సున్నిత హృదయులైన కవులు తమతమ అక్షరాస్త్రాల్ని సంధించటం, జాతిని సాంత్వన పర్చటం చరిత్ర మరిచిపోలేని ఉద్విగ్నఘట్టాలుగా గుర్తింపు పొందుతాయి. జరుగుతున్న పరిణామాలకు కరిగిపోయి, మరిగిపోయి అవతరించిన కవి సోమశిల తిరుపాల్. తన హృదయాన్ని కలచివేసిన క్షణాలను కవితానుయంగా మలిచి, రూపొందించిన సంపుటి 'తరమెల్లిపోతుంది'. భావావేశం కొంచెం ఎక్కువే. సమూహ జీవనం పట్ల. ప్రగతిశీల దృక్పథం పట్ల మరింత తక్కువ కనుమరుగవుతున్న త్యాగశీల తరంపట్ల ఆవేదన తిరుపాల్ అక్షరాల్లో ప్రతిబింబించింది.......................
© 2017,www.logili.com All Rights Reserved.