'ఈ దేశపు రాజ్యం కుల స్వభావం కలిగినది. రాజ్యం కూలితే తప్ప కులం పోదు. ఏ రాజ్యం దానంతట అది కూలాదు కనుక మనమే కూల్చాలి'. ఈ మాట చెప్పడం రాజద్రోహం అని ఎవరైనా అంటే అనొచ్చు. కానీ తప్పదు. ఈ మాట నేనే కాదు ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరు అంటారు. మాదిగ, పల్లె, మాల పల్లెపై కమ్మలు, రెడ్లు, బోయలు, కాపులు ఒక్కటా రెండా మదమెక్కిన కులోన్మాదులు దాడి చేసినప్పుడల్లా పోలీసులు మొదలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఒక్కరేమిటి రాజ్యపు అంగాలన్ని పీడక కులాల కొమ్ము కాసినప్పుడు రాజ్యానికి కుల స్వభావం ఉంది అనకుండా ఇంకోటి అనలేము. కారంచేడు మొదలు చుండూరు, చీమకుర్తి, వేంపెంట, పదిరికుప్పం, లక్ష్మీoపేట ఎక్కడ చూసిన రాజ్యం ఏనాడూ పల్లె పక్షం లేదు. అదే చేసిన చట్టం పక్షం లేదు. ఉన్నదల్లా దోపిడీ పక్షం. అధికార పక్షం. అణచివేత పక్షం. ఆయా కులాల పక్షం. ఒక్క మాటలో చెప్పాలనంటే మనువు పక్షం. ఇది సూక్ష్మంగా ఈ దేశపు ముఖ చిత్రం.
- అరుణాంక్ లత