ఒక మరణం
బాస్నేల్నీ ఆమె మంచం అంచున కూర్చుని తన భర్త చెంపని నిమిరింది. మూడు రోజులుగా అతనలా అచేతనంగా పడున్నాడు. ఎండిపోయి బీటలు వారిన ఎడారిలా ఉన్న అతని బట్ట తలపై నుంచి టోపీని తీసేసింది. కనుబొమ్మల మీది చెమట చుక్కలు ఆమె తలపై కప్పుకున్న మజెతో కొనతో తుడుస్తూ గట్టిగా మూసివున్న అతని కళ్ళని చూసింది. చూస్తూ సన్నని గొంతుతో, 'ఓ బావ్, ఏదోకటి చెప్పు' అన్నది.
ఆ ముసలాయన నోరు తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. శ్వాస వదులుతూ దగ్గటం మొదలుపెట్టాడు. ఒక బందకి ఆకారం ఇవ్వటానికి చెక్కుతుండగా దాని విరిగిన ముక్క ఒకటి అతని ఊపిరితిత్తుల్లో ఇరుక్కునివుంటే దాన్ని కక్కేయటానికేమో అన్నంత గట్టిగా దగ్గుతున్నాడు.
ఆ దగ్గు కొంచం తగ్గాక ఆమె తన చెవి భర్త పెదవుల దగ్గర పెట్టింది. చివరి మాటలు మాత్రం మిగిలున్నాయి. అమోనియా లాంటి ఒక ఘాటైన వాసన అతని నోటినుంచి వస్తుంది. 'ఈ వాసన చావుది. ఆమె అనుకుంది.
అరిపోతున్న వత్తిలా నెమ్మదిగా కొట్టుకుంటున్న ముసలాయన కళ్ళ వెంబడి కన్నీటి చుక్కలు రాలాయి. రాలి ఎండిపోయాయి. ఏ ఉలుకూ పలుకూ లేదు. ముసలాయన చెప్పాలనుకున్నదంతా కన్నీళ్ళతో చెప్పాడు, అది బాస్నేత్నీ ఆమైకి అర్ధమై ఉండొచ్చు.
అర్ధమైన వెంటనే ఆమె ఏడ్చింది. అలా ఏడ్చి ఆమెతో పాటు కూర్చున్న వాళ్ళందరినీ ఏడిపించింది................
ఒక మరణం బాస్నేల్నీ ఆమె మంచం అంచున కూర్చుని తన భర్త చెంపని నిమిరింది. మూడు రోజులుగా అతనలా అచేతనంగా పడున్నాడు. ఎండిపోయి బీటలు వారిన ఎడారిలా ఉన్న అతని బట్ట తలపై నుంచి టోపీని తీసేసింది. కనుబొమ్మల మీది చెమట చుక్కలు ఆమె తలపై కప్పుకున్న మజెతో కొనతో తుడుస్తూ గట్టిగా మూసివున్న అతని కళ్ళని చూసింది. చూస్తూ సన్నని గొంతుతో, 'ఓ బావ్, ఏదోకటి చెప్పు' అన్నది. ఆ ముసలాయన నోరు తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. శ్వాస వదులుతూ దగ్గటం మొదలుపెట్టాడు. ఒక బందకి ఆకారం ఇవ్వటానికి చెక్కుతుండగా దాని విరిగిన ముక్క ఒకటి అతని ఊపిరితిత్తుల్లో ఇరుక్కునివుంటే దాన్ని కక్కేయటానికేమో అన్నంత గట్టిగా దగ్గుతున్నాడు. ఆ దగ్గు కొంచం తగ్గాక ఆమె తన చెవి భర్త పెదవుల దగ్గర పెట్టింది. చివరి మాటలు మాత్రం మిగిలున్నాయి. అమోనియా లాంటి ఒక ఘాటైన వాసన అతని నోటినుంచి వస్తుంది. 'ఈ వాసన చావుది. ఆమె అనుకుంది. అరిపోతున్న వత్తిలా నెమ్మదిగా కొట్టుకుంటున్న ముసలాయన కళ్ళ వెంబడి కన్నీటి చుక్కలు రాలాయి. రాలి ఎండిపోయాయి. ఏ ఉలుకూ పలుకూ లేదు. ముసలాయన చెప్పాలనుకున్నదంతా కన్నీళ్ళతో చెప్పాడు, అది బాస్నేత్నీ ఆమైకి అర్ధమై ఉండొచ్చు. అర్ధమైన వెంటనే ఆమె ఏడ్చింది. అలా ఏడ్చి ఆమెతో పాటు కూర్చున్న వాళ్ళందరినీ ఏడిపించింది................© 2017,www.logili.com All Rights Reserved.