ఉద్రేకం నన్ను మింగేస్తోంది. తనపై వున్న వస్త్రాన్ని పూర్తిగా తొలగించాక ఇక నిర్జీవ ప్రతిమే ఈ ద్రౌపది. చావుకైనా సిద్దమనుకునే ఈ ద్రౌపదికి ఈ భయంకర భీకర పోరాటమెందుకు? పాండవులకు సంబంధించినదానను. వారి వస్తువుని వారి వంశప్రతిష్టని వారి బిడ్డలకు తల్లిని అవగలను. వారి మంగళ స్వరూపిణిని. నా సిగ్గే చచ్చిపోతుంటే నేనెందుకు చేతులు జోడించి దుఃఖంతో రోదించాలి? కాపాడుకోవడం చేతకాని వారికోసం నా ఈ అలుకులాట దేనికి ? పోనీ స్వరం పోనీ. నన్ను పోగొట్టుకోనీ. ఈ నీచమైన దుస్థితి నుండి ఒక్క ఆడదాన్ని, అందున కులస్త్రీని, అందున అర్ధాంగి మానమర్యాదలు మంటగలుస్తున్నా మౌనం వహించిన పాండవులకు రాజ్యమెందుకు? భార్యనే రక్షించుకోలేని వారు, పరిపాలకులేల కాగలరు? సిగ్గుని తప్పించుకోలేరుగా! ఈ అవమాన భారాన్ని మోస్తూ బ్రతకగలరా? ఒకవేళ వీరు ప్రభువులయితే ప్రజలలో తిరుగుబాటు ధోరణి అంతర్గతంగా అల్లుకుపోదా?
ద్రౌపది మనోవ్యధ అద్బుతంగా ఆవిష్కరించిన ఈ ద్రౌపది హృదయావిష్కరణ చదవండి.
ఉద్రేకం నన్ను మింగేస్తోంది. తనపై వున్న వస్త్రాన్ని పూర్తిగా తొలగించాక ఇక నిర్జీవ ప్రతిమే ఈ ద్రౌపది. చావుకైనా సిద్దమనుకునే ఈ ద్రౌపదికి ఈ భయంకర భీకర పోరాటమెందుకు? పాండవులకు సంబంధించినదానను. వారి వస్తువుని వారి వంశప్రతిష్టని వారి బిడ్డలకు తల్లిని అవగలను. వారి మంగళ స్వరూపిణిని. నా సిగ్గే చచ్చిపోతుంటే నేనెందుకు చేతులు జోడించి దుఃఖంతో రోదించాలి? కాపాడుకోవడం చేతకాని వారికోసం నా ఈ అలుకులాట దేనికి ? పోనీ స్వరం పోనీ. నన్ను పోగొట్టుకోనీ. ఈ నీచమైన దుస్థితి నుండి ఒక్క ఆడదాన్ని, అందున కులస్త్రీని, అందున అర్ధాంగి మానమర్యాదలు మంటగలుస్తున్నా మౌనం వహించిన పాండవులకు రాజ్యమెందుకు? భార్యనే రక్షించుకోలేని వారు, పరిపాలకులేల కాగలరు? సిగ్గుని తప్పించుకోలేరుగా! ఈ అవమాన భారాన్ని మోస్తూ బ్రతకగలరా? ఒకవేళ వీరు ప్రభువులయితే ప్రజలలో తిరుగుబాటు ధోరణి అంతర్గతంగా అల్లుకుపోదా? ద్రౌపది మనోవ్యధ అద్బుతంగా ఆవిష్కరించిన ఈ ద్రౌపది హృదయావిష్కరణ చదవండి.ద్రౌపతి ఆవిష్కరణ హృద్యంగా సాగింది. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలని ఆశిస్తూ...
© 2017,www.logili.com All Rights Reserved.