.
“బహుజన”వాదం - పెట్టుబడిగా “దళిత బహుజన”వాదం అనే సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఇటు బహుజనవాదాన్ని దళితులకు, అటు దళితవాదాన్ని క్రైస్తవానికి బహు చాకచక్యంగా మార్కెట్ చేయడము, క్రైస్తవమనే బూచిని హిందూమతానికి చూపెట్టి బాక్నెల్ చేయడమేకాక, ఆవిషయం ఏమాత్రం బయటపడకుండా ఉండటానికి... ఈ 'దళితబహుజన' వాదాన్ని కాన్షిరాంగారిచే ప్రతిపాదించ బడినదిగా... ప్రపంచవ్యాపితంగా పేరొందినదిగానో చెబుతున్న, కాపరివారి రచన “నేను హిందువునెట్లైత”లో... రాసారు.
గతంలో అగ్రవర్ణాలు, బహుజన అగ్రకులాలు దళితుల అణచివేతకు... బహుజనులని పావుల్ని చేసి, బహుజన కులాల బలాన్ని ఆయుధంగా మార్చి, తెలివిగా వినియోగించుకొన్నట్లే... ఇప్పుడు దళితులూ... అదే బహుజన బలాన్ని అగ్రకులాలను, బహుజన అగ్ర కులాలను బలహీనపరచడానికి, భయపెట్టడానికి ప్రయోగించాలనుకోవడంలో నుండి పుట్టినదే ఈ “దళిత బహుజనవాదం”. కాకుంటే అప్పుడు బహుజనులు 'అగ్రవర్ణాల గొప్ప' (మాయ) తమవైపు ఉందనే భ్రమలో బతకడం అందుకు కారణమైతే, ఇప్పుడు బహుజనకులాల అనైక్యత... దళితులకు వరంగా మారి "దళితబహుజనవాదం”గా రూపొంది..., తమ ప్రమేయం ఏమాత్రం లేకుండా, ఐలయ్య లాంటి... సామాజిక బ్లాక్మైలర్లకు ముడిసరుకుగా మారింది.
తమాషా అయిన విషయం ఏమిటంటే కాన్షిరాంగారు దళితుడిగా ఉండి, దళితుల వైపే ఉండి, బహుజనులను కూడగట్టుకొన్నవాడు, కానీ ఐలయ్య మాత్రం బహుజనుడై ఉండి “బహుజనవాదా”న్ని దళితులకు మార్కెట్ చేయగలిగిన చతురుడు. -
. “బహుజన”వాదం - పెట్టుబడిగా “దళిత బహుజన”వాదం అనే సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఇటు బహుజనవాదాన్ని దళితులకు, అటు దళితవాదాన్ని క్రైస్తవానికి బహు చాకచక్యంగా మార్కెట్ చేయడము, క్రైస్తవమనే బూచిని హిందూమతానికి చూపెట్టి బాక్నెల్ చేయడమేకాక, ఆవిషయం ఏమాత్రం బయటపడకుండా ఉండటానికి... ఈ 'దళితబహుజన' వాదాన్ని కాన్షిరాంగారిచే ప్రతిపాదించ బడినదిగా... ప్రపంచవ్యాపితంగా పేరొందినదిగానో చెబుతున్న, కాపరివారి రచన “నేను హిందువునెట్లైత”లో... రాసారు. గతంలో అగ్రవర్ణాలు, బహుజన అగ్రకులాలు దళితుల అణచివేతకు... బహుజనులని పావుల్ని చేసి, బహుజన కులాల బలాన్ని ఆయుధంగా మార్చి, తెలివిగా వినియోగించుకొన్నట్లే... ఇప్పుడు దళితులూ... అదే బహుజన బలాన్ని అగ్రకులాలను, బహుజన అగ్ర కులాలను బలహీనపరచడానికి, భయపెట్టడానికి ప్రయోగించాలనుకోవడంలో నుండి పుట్టినదే ఈ “దళిత బహుజనవాదం”. కాకుంటే అప్పుడు బహుజనులు 'అగ్రవర్ణాల గొప్ప' (మాయ) తమవైపు ఉందనే భ్రమలో బతకడం అందుకు కారణమైతే, ఇప్పుడు బహుజనకులాల అనైక్యత... దళితులకు వరంగా మారి "దళితబహుజనవాదం”గా రూపొంది..., తమ ప్రమేయం ఏమాత్రం లేకుండా, ఐలయ్య లాంటి... సామాజిక బ్లాక్మైలర్లకు ముడిసరుకుగా మారింది. తమాషా అయిన విషయం ఏమిటంటే కాన్షిరాంగారు దళితుడిగా ఉండి, దళితుల వైపే ఉండి, బహుజనులను కూడగట్టుకొన్నవాడు, కానీ ఐలయ్య మాత్రం బహుజనుడై ఉండి “బహుజనవాదా”న్ని దళితులకు మార్కెట్ చేయగలిగిన చతురుడు. -© 2017,www.logili.com All Rights Reserved.