కాత్యాయనీ విద్మహే తెలుగు పాఠకులకు చిరపరిచితమైన రచయిత్రి. సాహిత్య వికాసంలో సగం - స్త్రీల అస్థిత్వ సాహిత్యం - కవిత్వం - కథ , 2010 లో ప్రచురించబడిన వ్యాస సంకలనానికి ఆమెకు 2013 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా చేసి విశ్రాంతి తీసుకున్నారు.
తెలుగు సాహిత్యంలో 275 పరిశోధనలు ఆమె సొంతం. 28 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మరో 25 పుస్తకాలకు సంపాదకురాలిగా పనిచేసారు. 2013 లో ప్రభుత్వ అసహనాన్ని నిరసిస్తూ అవార్డులు తిరిగి ఇచ్చిన రచయితలకు, కవులకు సంఘీభావంగా కాత్యాయనీ విద్మహే గారు కూడా తన అవార్డును తిరిగి ఇచ్చారు. కాత్యాయనీ విద్మహే సాహిత్య విమర్శకురాలే కాదు. రచయిత్రలను ఒక వేదిక పైకి తెచ్చి ప్రజాప్రయోజనకర రచనలకు ఊతం ఇచ్చిన ఒక స్ఫూర్తి కూడా.