కవిత్వం గురించి ఎవరు ఎంతగా చెప్పినా దాని గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. మనిషికి మనిషికి మధ్య ఒక బంధాన్ని, ప్రాంతానికి ప్రాంతానికి మధ్య అనుబంధాన్ని దేశానికి దేశానికి మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కలిగించే సుగుణం కవిత్వానికి ఉంది.
ఒక మాటలో చెప్పాలంటే కవిత్వానికి ఉన్న శక్తి ఈ సకల చరాచర జగత్తులో దేనికీ లేదు. అటువంటి కవిత్వంలో అడుగుపెట్టడం ఆస్వాదించడం అనేవి మనిషికి అత్యంత మహత్తరమైన అవకాశం.
కవిత్వం.. ప్రాణప్రదంగా రాసే వారిని, కవిత్వం.. అనుభూతి మయంగా చదివేవారిని ఏ విషయంలోనూ అనుమానించాల్సిన పనిలేదు. వాళ్ళు తాత్వికులు సాధారణ మనుషులకంటే జ్ఞానంలో ముందంజలో ఉన్నవారు. కవిత్వ కళలోనే కాకుండా ఇతర కళల్లో రాణిస్తున్న వారకి కూడా ఈ విషయం వర్తిస్తుంది. కవిత్వం రాసే వాళ్ళు దేవుళ్ళు. కవిత్వం చదివే వాళ్ళు దేవుడితో సమానమైన భక్తులు. భగవంతుడు గొప్పా? భక్తుడు గొప్ప? అనే చర్చకు ఇక్కడ తావు లేదు.
ఇకపోతే ఈ సంకలనం "విశ్వమంతా విస్తరించాలని..." ఈ విశ్వాంతరాళంలో ఉద్భవించిన ప్రశ్నలు అడగాలన్నా, అలాంటి ప్రశ్నలకు బదులు పలకాలన్నా కవిత్వం ఒక సాధనం, మనిషి ఆలోచనను సక్రమంగా నడిపే ఇందనం.
సూటిగా ప్రశ్నించినా, ధిక్కార స్వరంతో జవాబిచ్చినా అది కవి సమాజం పట్ల బాధ్యతతో ఆ సమాజం చుట్టూ కట్టే అక్షర ప్రకారం.
అలాంటి కవులు 21 మంది కలిసి నిర్మించిన విశ్వజనీన కవన భవనం ఈ ఉద్గ్రంధం.
మౌనశ్రీ మల్లిక్
మహా సంకల్పం
***
"జీవితంలో కవిత్వం వరించడం ఉత్సవం
కవిత్వంలో జీవితం తరించడం ఉద్యమం
***
కవిత్వం గురించి ఎవరు ఎంతగా చెప్పినా దాని గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. మనిషికి మనిషికి మధ్య ఒక బంధాన్ని, ప్రాంతానికి ప్రాంతానికి మధ్య అనుబంధాన్ని దేశానికి దేశానికి మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కలిగించే సుగుణం కవిత్వానికి ఉంది.
ఒక మాటలో చెప్పాలంటే కవిత్వానికి ఉన్న శక్తి ఈ సకల చరాచర జగత్తులో దేనికీ లేదు. అటువంటి కవిత్వంలో అడుగుపెట్టడం ఆస్వాదించడం అనేవి మనిషికి అత్యంత మహత్తరమైన అవకాశం.
కవిత్వం.. ప్రాణప్రదంగా రాసే వారిని, కవిత్వం.. అనుభూతి మయంగా చదివేవారిని ఏ విషయంలోనూ అనుమానించాల్సిన పనిలేదు. వాళ్ళు తాత్వికులు సాధారణ మనుషులకంటే జ్ఞానంలో ముందంజలో ఉన్నవారు. కవిత్వ కళలోనే కాకుండా ఇతర కళల్లో రాణిస్తున్న వారకి కూడా ఈ విషయం వర్తిస్తుంది. కవిత్వం రాసే వాళ్ళు దేవుళ్ళు. కవిత్వం చదివే వాళ్ళు దేవుడితో సమానమైన భక్తులు. భగవంతుడు గొప్పా? భక్తుడు గొప్ప? అనే చర్చకు ఇక్కడ తావు లేదు.
ఇకపోతే ఈ సంకలనం "విశ్వమంతా విస్తరించాలని..." ఈ విశ్వాంతరాళంలో ఉద్భవించిన ప్రశ్నలు అడగాలన్నా, అలాంటి ప్రశ్నలకు బదులు పలకాలన్నా కవిత్వం ఒక సాధనం, మనిషి ఆలోచనను సక్రమంగా నడిపే ఇందనం.
సూటిగా ప్రశ్నించినా, ధిక్కార స్వరంతో జవాబిచ్చినా అది కవి సమాజం పట్ల బాధ్యతతో ఆ సమాజం చుట్టూ కట్టే అక్షర ప్రకారం.
అలాంటి కవులు 21 మంది కలిసి నిర్మించిన విశ్వజనీన కవన భవనం ఈ ఉద్గ్రంధం. మౌనశ్రీ మల్లిక్