సాంప్రదాయక రచన - ఆధునిక సారూప్యత - సమకాలీన వైవిధ్యత వెరసి వేటూరి సుందరరామమూర్తి. శంకరాభరణానికి - యమగోలకి పాటల రచనలో పొంతనెక్కడ ఉంది? వేటూరి కలంబలం అలాంటిది కామోసు. దానికి ఎల్లలు లేవు. దాని పరిణతికి పరిమితులు, అవధులు లేవు. సినిమా గేయరచన వడ్డనలో కాకరకాయ చేదుని, పనసపండు తీపిని సమంగా వడ్డించగలిగినవాడే కాదు, చేదు - తీపిలను మధురంగా ఆస్వాదింపజేసేవాడు కూడా! అటువంటి వేటూరి కృష్ణజిల్లాలోని పెదకళ్ళేపల్లి లో జన్మించారు. ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్నదీ ఆ గ్రామంలోనే.
హిందూ - బౌద్ధ మతాలకు నేలవైపున్న ఈ గ్రామం వేటూరికి పాటల పట్ల అవగాహన కల్పించిన ఊరు. గురువు సుసర్ల కృష్ణ బ్రహ్మ శాస్త్రి గారు, ఆయన శిష్యుడు ఘంటసాల శృతి చేసి ఆలాపనాభ్యాసం చేసినది వేటూరిగారి ఇంటివీధి అరుగు మీదే! కాని చిత్రరంగానికి వచ్చాక వేటూరి పాటకి ఘంటసాల పాడలేకపోయారు. అయితే 'శారద' వంటి చిత్రాలకు వేటూరి పాటలు రాశారు. ఘంటసాల పాడారు కూడా! కాని వేటూరి పాటలు పాడలేక పోవడం బాదే కదా!
సాంప్రదాయక రచన - ఆధునిక సారూప్యత - సమకాలీన వైవిధ్యత వెరసి వేటూరి సుందరరామమూర్తి. శంకరాభరణానికి - యమగోలకి పాటల రచనలో పొంతనెక్కడ ఉంది? వేటూరి కలంబలం అలాంటిది కామోసు. దానికి ఎల్లలు లేవు. దాని పరిణతికి పరిమితులు, అవధులు లేవు. సినిమా గేయరచన వడ్డనలో కాకరకాయ చేదుని, పనసపండు తీపిని సమంగా వడ్డించగలిగినవాడే కాదు, చేదు - తీపిలను మధురంగా ఆస్వాదింపజేసేవాడు కూడా! అటువంటి వేటూరి కృష్ణజిల్లాలోని పెదకళ్ళేపల్లి లో జన్మించారు. ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్నదీ ఆ గ్రామంలోనే. హిందూ - బౌద్ధ మతాలకు నేలవైపున్న ఈ గ్రామం వేటూరికి పాటల పట్ల అవగాహన కల్పించిన ఊరు. గురువు సుసర్ల కృష్ణ బ్రహ్మ శాస్త్రి గారు, ఆయన శిష్యుడు ఘంటసాల శృతి చేసి ఆలాపనాభ్యాసం చేసినది వేటూరిగారి ఇంటివీధి అరుగు మీదే! కాని చిత్రరంగానికి వచ్చాక వేటూరి పాటకి ఘంటసాల పాడలేకపోయారు. అయితే 'శారద' వంటి చిత్రాలకు వేటూరి పాటలు రాశారు. ఘంటసాల పాడారు కూడా! కాని వేటూరి పాటలు పాడలేక పోవడం బాదే కదా!© 2017,www.logili.com All Rights Reserved.