ఇప్పుడు టైము ఎంతవుతుందిరా? చౌదరి గారి ఇంటిముందు తెల్లావుకు మేత వేస్తున్న చిన్న పాలేరు చిన్నాడిని అడిగాడు అటుగా పోతున్న గ్రామస్థుడు ఒకతను. చేతి గడియారం లేదు చిన్నాడికి. అయినాసరే తడుముకోలేదతను. 'కొంచెం ఆగు బాబాయ్.. కొంచెం ఓపికపట్టి ఆగితే నీకే తెలిసిపోద్ది' అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతను ఆ మాట అంటుండగానే ఇంట్లోనుంచి బయటికి వచ్చారు చౌదరిగారు. జానెడు పొడుగుచుట్టను నోట్లో పెట్టుకుంటూ చూశారు. 'అర్థం అయిందిరా చిన్నాడా.. సరిగ్గా ఆరుగంటలు అయిందన్న మాట! పొద్దు పొడవటమన్నా ఆలస్యం అవుతుందేమోగాని, మీ డోరా ఇంట్లోనుంచి బయటికి కాలుపెట్టడం మాత్రం ఈ జన్మలో ఆలస్యంకాదు. వస్తానురా.. గారపచేలో పడేసిన కండి కట్టాలని ఏ దొంగనాయాలైనా ఎత్తుకుపోయాడేమో చూసుకోవాలి' అంటూ ముందుకు సాగిపోయాడు గ్రామస్థుడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఇప్పుడు టైము ఎంతవుతుందిరా? చౌదరి గారి ఇంటిముందు తెల్లావుకు మేత వేస్తున్న చిన్న పాలేరు చిన్నాడిని అడిగాడు అటుగా పోతున్న గ్రామస్థుడు ఒకతను. చేతి గడియారం లేదు చిన్నాడికి. అయినాసరే తడుముకోలేదతను. 'కొంచెం ఆగు బాబాయ్.. కొంచెం ఓపికపట్టి ఆగితే నీకే తెలిసిపోద్ది' అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతను ఆ మాట అంటుండగానే ఇంట్లోనుంచి బయటికి వచ్చారు చౌదరిగారు. జానెడు పొడుగుచుట్టను నోట్లో పెట్టుకుంటూ చూశారు. 'అర్థం అయిందిరా చిన్నాడా.. సరిగ్గా ఆరుగంటలు అయిందన్న మాట! పొద్దు పొడవటమన్నా ఆలస్యం అవుతుందేమోగాని, మీ డోరా ఇంట్లోనుంచి బయటికి కాలుపెట్టడం మాత్రం ఈ జన్మలో ఆలస్యంకాదు. వస్తానురా.. గారపచేలో పడేసిన కండి కట్టాలని ఏ దొంగనాయాలైనా ఎత్తుకుపోయాడేమో చూసుకోవాలి' అంటూ ముందుకు సాగిపోయాడు గ్రామస్థుడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.