ఈ నవలలో నాకు నచ్చే అంశాలు - మొదలుపెడితే ఆపకుండా చివరిదాకా చదివించే గుణం, కథానాయకుడి పాత్ర సగటు మనుషుల్లాగా అనేక ఛాయలు కలిగి ఉండడం. అలాగే అబ్బాయిని అమెరికా పంపించే తల్లిదండ్రులు, అమెరికాలో స్థిరపడిన ముందుతరం వారి ఆలోచనా విధానాలు, రెండింటి మధ్యనా పై చదువులకోసం వెళ్ళిన యువకుడి తపన, పట్టుదల, పయనం ఆసక్తికరంగా రచయిత పాఠకుల ముందుంచారు.
- భారతి కొదమసింహం
ఆధునిక జీవితాన్ని ఆశించి, ఓ దిగువ మధ్యతరగతి కుర్రాడు చేసే అమెరికా ప్రస్తానం ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితాలని డాలర్లలో ఊహించుకునే మనం అక్కడ జరిగే ఎన్ని విషయాలని తెలుసుకోగలం? తెలుసుకున్నా ఎంతవరకు అర్థం చేసుకోగలం? వాళ్ళ అనుభవాలతో, అంచనాలతో, విజయాలతో, వైఫల్యాలతో, అక్కడక్కడా చేసుకునే ఆత్మవంచానలతో మనం సహానుభూతి చెందే అవకాశాన్ని అందించిన మంచి నవల. అమెరికా జీవితాన్ని అరమరికలు లేకుండా విప్పి చెప్పింది ఈ 'అంతర్జ్వలన'.
- ఎ వి రమణమూర్తి
ఈ నవలలో నాకు నచ్చే అంశాలు - మొదలుపెడితే ఆపకుండా చివరిదాకా చదివించే గుణం, కథానాయకుడి పాత్ర సగటు మనుషుల్లాగా అనేక ఛాయలు కలిగి ఉండడం. అలాగే అబ్బాయిని అమెరికా పంపించే తల్లిదండ్రులు, అమెరికాలో స్థిరపడిన ముందుతరం వారి ఆలోచనా విధానాలు, రెండింటి మధ్యనా పై చదువులకోసం వెళ్ళిన యువకుడి తపన, పట్టుదల, పయనం ఆసక్తికరంగా రచయిత పాఠకుల ముందుంచారు. - భారతి కొదమసింహం ఆధునిక జీవితాన్ని ఆశించి, ఓ దిగువ మధ్యతరగతి కుర్రాడు చేసే అమెరికా ప్రస్తానం ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితాలని డాలర్లలో ఊహించుకునే మనం అక్కడ జరిగే ఎన్ని విషయాలని తెలుసుకోగలం? తెలుసుకున్నా ఎంతవరకు అర్థం చేసుకోగలం? వాళ్ళ అనుభవాలతో, అంచనాలతో, విజయాలతో, వైఫల్యాలతో, అక్కడక్కడా చేసుకునే ఆత్మవంచానలతో మనం సహానుభూతి చెందే అవకాశాన్ని అందించిన మంచి నవల. అమెరికా జీవితాన్ని అరమరికలు లేకుండా విప్పి చెప్పింది ఈ 'అంతర్జ్వలన'. - ఎ వి రమణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.