అనుబంధాలు-ఆవేశాలు
వాతావరణం చాలా ఉధృతంగా వున్నది. మేఘాలు దట్టంగా కమ్ముకుని పట్ట పగలు కూడ చిక్కని చీకట్లు కమ్ముకున్నాయి. గాలికి వృక్షాలు అల్లకల్లోలంగా వూగుతూ చిన్నతనంలో చదువుకున్న రాక్షసుడి కథలో రాక్షసుడు తలలు, చేతులు వూపుతున్నట్టు భయం గొలుపుతున్నాయి. ఆ గాలి విసురుకు కొమ్మలు విరిగి పడి పోవచ్చునేమోననిపిస్తుంది. ఆకాశంలో దేవతలు ఒక్కసారిగా వరుస దీపాలు వెలిగించి నట్లు మిరుమిట్లు గొలిపే మెరుపు చూడలేక కళ్ళు మూసుకున్నాను. దట్టంగా కమ్ముకున్న చీకటి వలన, ధారాపాతంగా కురుస్తున్న వర్షం వలన అడవిలో త్రోవ కనుపించటం లేదు. వర్షం తగ్గే వరకు కారు పక్కకు తీసి ఆపుకు ందామనుకున్నా ఆ భీభత్స వాతావరణంలో ఎక్కడ ఆపితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియక అవస్థ పడుతున్నాడు గోవిందు. మేము చేరుకోవలసిన ప్రదేశం అడవి మధ్యలో ఎక్కడో వున్నదని తెలిసినా పగలు ప్రయాణమే కదా ప్రొద్దున్నే బయలు దేరితే సాయంత్రాని కల్లా ఇంటికి తిరిగి రావచ్చునని, నాన్న గారికి అమ్మకి నచ్చ చెప్పి, ధైర్యంగా తోడు లేకుండా బయలుదేరాను.
నేను పుట్టక ముందు నుండి నాన్న గారి దగ్గర పని చేస్తూ ఎంతో నమ్మకంగా వుంటున్న గోవిందు వున్నాడు కదా అని వేరే తోడు గురించి ఆలోచించ లేదు. నాన్న గారు నన్ను ఆదుకోక పోయినట్టయితే ఏమై పోయి వుండే వాడినో తల్లీ! అని గోవిందు తన కథ ఎన్నిసార్లు చెప్పినా కన్నీళు నింపుకునే చెప్తాడు.
పుట్టుక తోటే మనిషి దొంగ కాడు. పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి జీవనంలో మార్పు వస్తుందని ఆరోజు న్యాయ స్థానంలో వాదించి బక్క చిక్కిన శరీరంతో, చిరిగిన బట్టల్తో దీనాతి దీనంగా చూస్తూ బోనులో నిల్చున్న వ్యక్తి గురించి ఆలోచిస్తూ అప్రమత్తంగా నడుస్తున్న నాన్న గారు, "దొంగా, దొంగా..............
అనుబంధాలు-ఆవేశాలు వాతావరణం చాలా ఉధృతంగా వున్నది. మేఘాలు దట్టంగా కమ్ముకుని పట్ట పగలు కూడ చిక్కని చీకట్లు కమ్ముకున్నాయి. గాలికి వృక్షాలు అల్లకల్లోలంగా వూగుతూ చిన్నతనంలో చదువుకున్న రాక్షసుడి కథలో రాక్షసుడు తలలు, చేతులు వూపుతున్నట్టు భయం గొలుపుతున్నాయి. ఆ గాలి విసురుకు కొమ్మలు విరిగి పడి పోవచ్చునేమోననిపిస్తుంది. ఆకాశంలో దేవతలు ఒక్కసారిగా వరుస దీపాలు వెలిగించి నట్లు మిరుమిట్లు గొలిపే మెరుపు చూడలేక కళ్ళు మూసుకున్నాను. దట్టంగా కమ్ముకున్న చీకటి వలన, ధారాపాతంగా కురుస్తున్న వర్షం వలన అడవిలో త్రోవ కనుపించటం లేదు. వర్షం తగ్గే వరకు కారు పక్కకు తీసి ఆపుకు ందామనుకున్నా ఆ భీభత్స వాతావరణంలో ఎక్కడ ఆపితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియక అవస్థ పడుతున్నాడు గోవిందు. మేము చేరుకోవలసిన ప్రదేశం అడవి మధ్యలో ఎక్కడో వున్నదని తెలిసినా పగలు ప్రయాణమే కదా ప్రొద్దున్నే బయలు దేరితే సాయంత్రాని కల్లా ఇంటికి తిరిగి రావచ్చునని, నాన్న గారికి అమ్మకి నచ్చ చెప్పి, ధైర్యంగా తోడు లేకుండా బయలుదేరాను. నేను పుట్టక ముందు నుండి నాన్న గారి దగ్గర పని చేస్తూ ఎంతో నమ్మకంగా వుంటున్న గోవిందు వున్నాడు కదా అని వేరే తోడు గురించి ఆలోచించ లేదు. నాన్న గారు నన్ను ఆదుకోక పోయినట్టయితే ఏమై పోయి వుండే వాడినో తల్లీ! అని గోవిందు తన కథ ఎన్నిసార్లు చెప్పినా కన్నీళు నింపుకునే చెప్తాడు. పుట్టుక తోటే మనిషి దొంగ కాడు. పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి జీవనంలో మార్పు వస్తుందని ఆరోజు న్యాయ స్థానంలో వాదించి బక్క చిక్కిన శరీరంతో, చిరిగిన బట్టల్తో దీనాతి దీనంగా చూస్తూ బోనులో నిల్చున్న వ్యక్తి గురించి ఆలోచిస్తూ అప్రమత్తంగా నడుస్తున్న నాన్న గారు, "దొంగా, దొంగా..............© 2017,www.logili.com All Rights Reserved.