పాలమూరు జిల్లా... జమిస్తాపూర్ గ్రామం...
రాత్రి పది గంటల సమయం....
నల్లగా ఆకాశాన్నంతా కమ్ముకున్న మబ్బులు పెళ పెళమంటూ ఉరుముతూ భూమికి చిల్లులు పడతాయేమో అన్నట్లుగా జోరున వానను నేల మీదకు విసిరి కొడుతున్నాయి. ఊరంతా చిక్కటి చీకటి. గాంభీర్యంగా వీస్తున్న ఈదురు గాలులు నీడనిచ్చే చెట్లను అమాంతం విరిచి పారేస్తాయేమో అన్నట్లుగా ఉంది.
"ఊకో బిడ్డ! జరంత ఓర్సుకో..." పురిటి నొప్పులతో కేకలు పెడుతూ విలవిల్లాడుతున్న ఆమెను ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తోంది ఒకావిడ.
అక్కడే ఉన్న మరో ఆవిడ పరుగులాంటి నడకతో బయటికివెళ్లి, "ఓ యాదయ్య! నొప్పులు ఎక్వైతున్నయ్, లోపట బిడ్డ అడ్డం దిరిగినట్లున్నది. పోయి గా డాక్టరమ్మని తోల్కరాపో!” భార్య పురిటి నొప్పుల కేకలు వింటూ ఆందోళనగా గుమ్మం బయట తచ్చాడుతున్న యాదయ్యకు పురమాయించింది.
క్షణం ఆలస్యం చేయకుండా ఊళ్ళో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే డాక్టరమ్మ కోసం... కుండపోతగా కురుస్తున్న వానను సైతం లెక్కజేయకుండా పరిగెత్తుకుంటూ ఆవిడ ఇంటికి వెళ్ళాడు.
"డాక్టరమ్మా! డాక్టరమ్మా!" దబదబా తలుపులు బాదాడు.
ఆ రాత్రి వేళ హఠాత్తుగా వచ్చిన ఆ శబ్దానికి, పుస్తకం చదువుతున్న లలిత ఉలిక్కిపడి, “ఈ సమయంలో తలుపు తడుతున్నది ఎవరైయుంటారు?" లిప్తపాటు ఆలోచించి, కుర్చీలోంచి పైకి లేచి గబగబా నడుస్తూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా వర్షంలో తడిసి ముద్దై వణుకుతూ కంగారుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి, "యాదయ్యా నువ్వా? ఏంటి ఈ టైంలో? ఎందుకా కంగారు ఏం జరిగింది?” ఆతృతగా అడిగింది. "అమ్మా! గౌరికి నొప్పులొస్తున్నయ్, బిడ్డ అడ్డం దిరిగిందంటుండ్రు. మీరే ఎట్లైనా కాపాడాలే" అర్థించాడు..............
పాలమూరు జిల్లా... జమిస్తాపూర్ గ్రామం... రాత్రి పది గంటల సమయం.... నల్లగా ఆకాశాన్నంతా కమ్ముకున్న మబ్బులు పెళ పెళమంటూ ఉరుముతూ భూమికి చిల్లులు పడతాయేమో అన్నట్లుగా జోరున వానను నేల మీదకు విసిరి కొడుతున్నాయి. ఊరంతా చిక్కటి చీకటి. గాంభీర్యంగా వీస్తున్న ఈదురు గాలులు నీడనిచ్చే చెట్లను అమాంతం విరిచి పారేస్తాయేమో అన్నట్లుగా ఉంది. "ఊకో బిడ్డ! జరంత ఓర్సుకో..." పురిటి నొప్పులతో కేకలు పెడుతూ విలవిల్లాడుతున్న ఆమెను ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తోంది ఒకావిడ. అక్కడే ఉన్న మరో ఆవిడ పరుగులాంటి నడకతో బయటికివెళ్లి, "ఓ యాదయ్య! నొప్పులు ఎక్వైతున్నయ్, లోపట బిడ్డ అడ్డం దిరిగినట్లున్నది. పోయి గా డాక్టరమ్మని తోల్కరాపో!” భార్య పురిటి నొప్పుల కేకలు వింటూ ఆందోళనగా గుమ్మం బయట తచ్చాడుతున్న యాదయ్యకు పురమాయించింది. క్షణం ఆలస్యం చేయకుండా ఊళ్ళో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే డాక్టరమ్మ కోసం... కుండపోతగా కురుస్తున్న వానను సైతం లెక్కజేయకుండా పరిగెత్తుకుంటూ ఆవిడ ఇంటికి వెళ్ళాడు. "డాక్టరమ్మా! డాక్టరమ్మా!" దబదబా తలుపులు బాదాడు. ఆ రాత్రి వేళ హఠాత్తుగా వచ్చిన ఆ శబ్దానికి, పుస్తకం చదువుతున్న లలిత ఉలిక్కిపడి, “ఈ సమయంలో తలుపు తడుతున్నది ఎవరైయుంటారు?" లిప్తపాటు ఆలోచించి, కుర్చీలోంచి పైకి లేచి గబగబా నడుస్తూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా వర్షంలో తడిసి ముద్దై వణుకుతూ కంగారుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి, "యాదయ్యా నువ్వా? ఏంటి ఈ టైంలో? ఎందుకా కంగారు ఏం జరిగింది?” ఆతృతగా అడిగింది. "అమ్మా! గౌరికి నొప్పులొస్తున్నయ్, బిడ్డ అడ్డం దిరిగిందంటుండ్రు. మీరే ఎట్లైనా కాపాడాలే" అర్థించాడు..............© 2017,www.logili.com All Rights Reserved.