చంద్రవంక సాహిత్యపరంగా చూస్తే ఒక నవల. చరిత్ర పరంగా చూస్తే ఒక వాస్తవ చరిత్ర. సామాజిక శాస్త్రపరంగా చూస్తే వివిధ వర్గాలు, కులాలు, మతాల సంఘర్షణల ప్రతిఫలనం. రాజకీయంగా చూస్తే కొన్ని ఆధిపత్య వర్గాలు, మరికొన్ని పీడిత వర్గాల్ని తమ పాలనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటారని గుర్తించగలిగే రాజకీయ శాస్త్రం. ఆ దాడుల వెనుక దాగిన ఆర్థిక శాస్త్రాన్ని చెప్పిన నవల. వస్తుపరంగా అన్ని పార్శ్వాలూ ఈ నవల్లో వున్నాయి. సాహిత్యపరంగా పరిపూర్ణమైన నవలా లక్షణాలతో పాఠకుణ్ణి ఏకబిగిన చదివిస్తుంది.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
చంద్రవంక పాత్ర ద్వారా తన అనుభవాల్ని, ఆక్రోశాన్ని, గుండెమంటల్ని తెలియజేస్తారు. చంద్రవంక నవల్లోకి వెళ్ళేకొద్ది రాష్ట్రంలో జరిగిన అనేక దాడులు, వాటి పూర్వాపరాలు మనకు ఆవేశాన్ని, ఆలోచనను, ప్రతిఘటన, పోరాటం తెగింపు నేర్పుతాయి. బడుగు జీవుల బతుకు చిత్రం. సాంఘిక దురాచారాల, దేవదాసీ వృత్తి, బహుజనులపై జరిగిన దాడులు, సామాజిక ఉద్యమాలు మరెన్నో సంఘటనలు కథావస్తువులుగా మనల్ని నవల్లోకి తీసుకొనిపోయి నవలాంతం వరకు పాఠకులను
-డా||బద్దిపూడి జయరావు కట్టిపడేస్తుంది.
సాహిత్య చరిత్రలే కాదు, ఉద్యమాల చరిత్రలూ అవాస్తవాల్ని భద్రంగా దాచి వుంచి, భవిష్యత్తరాలకు వాటినే పాఠాలుగా వల్లెవేయిస్తున్న విద్యావ్యవస్థలో మట్టిని మట్టిలో కలిసిపోకుండా ఒక పాత్రగా మలచినట్టు వాస్తవ సంఘటనల్ని నవలగా మార్చి మన ముందుకు తెచ్చారు. ఒక ఉద్యమకారుడు, ఒక అక్షర శ్రామికుడు అయిన దుగినపల్లి ఎజ్రాశాస్త్రి, అదే ఈ చంద్రవంక నవల, కలిమిశ్రీ
చంద్రవంక సాహిత్యపరంగా చూస్తే ఒక నవల. చరిత్ర పరంగా చూస్తే ఒక వాస్తవ చరిత్ర. సామాజిక శాస్త్రపరంగా చూస్తే వివిధ వర్గాలు, కులాలు, మతాల సంఘర్షణల ప్రతిఫలనం. రాజకీయంగా చూస్తే కొన్ని ఆధిపత్య వర్గాలు, మరికొన్ని పీడిత వర్గాల్ని తమ పాలనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటారని గుర్తించగలిగే రాజకీయ శాస్త్రం. ఆ దాడుల వెనుక దాగిన ఆర్థిక శాస్త్రాన్ని చెప్పిన నవల. వస్తుపరంగా అన్ని పార్శ్వాలూ ఈ నవల్లో వున్నాయి. సాహిత్యపరంగా పరిపూర్ణమైన నవలా లక్షణాలతో పాఠకుణ్ణి ఏకబిగిన చదివిస్తుంది. -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చంద్రవంక పాత్ర ద్వారా తన అనుభవాల్ని, ఆక్రోశాన్ని, గుండెమంటల్ని తెలియజేస్తారు. చంద్రవంక నవల్లోకి వెళ్ళేకొద్ది రాష్ట్రంలో జరిగిన అనేక దాడులు, వాటి పూర్వాపరాలు మనకు ఆవేశాన్ని, ఆలోచనను, ప్రతిఘటన, పోరాటం తెగింపు నేర్పుతాయి. బడుగు జీవుల బతుకు చిత్రం. సాంఘిక దురాచారాల, దేవదాసీ వృత్తి, బహుజనులపై జరిగిన దాడులు, సామాజిక ఉద్యమాలు మరెన్నో సంఘటనలు కథావస్తువులుగా మనల్ని నవల్లోకి తీసుకొనిపోయి నవలాంతం వరకు పాఠకులను -డా||బద్దిపూడి జయరావు కట్టిపడేస్తుంది. సాహిత్య చరిత్రలే కాదు, ఉద్యమాల చరిత్రలూ అవాస్తవాల్ని భద్రంగా దాచి వుంచి, భవిష్యత్తరాలకు వాటినే పాఠాలుగా వల్లెవేయిస్తున్న విద్యావ్యవస్థలో మట్టిని మట్టిలో కలిసిపోకుండా ఒక పాత్రగా మలచినట్టు వాస్తవ సంఘటనల్ని నవలగా మార్చి మన ముందుకు తెచ్చారు. ఒక ఉద్యమకారుడు, ఒక అక్షర శ్రామికుడు అయిన దుగినపల్లి ఎజ్రాశాస్త్రి, అదే ఈ చంద్రవంక నవల, కలిమిశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.