బాంబే సిటీలోని ప్యారేలాల్ సెంటర్లో రిక్షాని ఆపాడు రషీద్ మియా. వచ్చేపోయే జనం మూలకంగా ఉత్పన్నమవుతున్న సందడితోనూ, పొగలు విడుస్తూ ఇష్టం వచినట్లు పరుగులు తీస్తున్న మోటార్ వెహికల్స్ మోతలతోను, ఫుట్ పాత్స్ కి అడ్డంగా తమ దుకాణాల్ని పరిచిన స్ట్రీట్ హాకర్స్ అరిచే పెద్ద పెద్ద అరుపులతోను దద్దరిల్లిపోతున్నది ఆ సెంటర్. ఫ్యాన్సీ షాపులోకి వెళ్లి రెండు నిముషాల్లో వచ్చేస్తాను. ఇక్కడే ఉంటావా? రిక్షా దిగి ఐదు రూపాయల నోటును రషీద్ మియా చేతిలో పెడుతూ అడిగింది సవారీ. "బడా బేకార్ సెంటరమ్మా ఇది.. ఏ క్షణంలో ఏ కానిస్టేబుల్ వస్తడో, ఏ కారణం చెప్పి పైసల్ని బయటికి తీయమంటడో తెలియదు" అడగకుండానే మామూలు రేటుమీద ఒక రూపాయి ఎక్కువిచ్చిన ఆ సవారీని వదులుకోవడం ఇష్టంలేక, సన్నగా గొణిగాడు రషీద్ మియా. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
బాంబే సిటీలోని ప్యారేలాల్ సెంటర్లో రిక్షాని ఆపాడు రషీద్ మియా. వచ్చేపోయే జనం మూలకంగా ఉత్పన్నమవుతున్న సందడితోనూ, పొగలు విడుస్తూ ఇష్టం వచినట్లు పరుగులు తీస్తున్న మోటార్ వెహికల్స్ మోతలతోను, ఫుట్ పాత్స్ కి అడ్డంగా తమ దుకాణాల్ని పరిచిన స్ట్రీట్ హాకర్స్ అరిచే పెద్ద పెద్ద అరుపులతోను దద్దరిల్లిపోతున్నది ఆ సెంటర్. ఫ్యాన్సీ షాపులోకి వెళ్లి రెండు నిముషాల్లో వచ్చేస్తాను. ఇక్కడే ఉంటావా? రిక్షా దిగి ఐదు రూపాయల నోటును రషీద్ మియా చేతిలో పెడుతూ అడిగింది సవారీ. "బడా బేకార్ సెంటరమ్మా ఇది.. ఏ క్షణంలో ఏ కానిస్టేబుల్ వస్తడో, ఏ కారణం చెప్పి పైసల్ని బయటికి తీయమంటడో తెలియదు" అడగకుండానే మామూలు రేటుమీద ఒక రూపాయి ఎక్కువిచ్చిన ఆ సవారీని వదులుకోవడం ఇష్టంలేక, సన్నగా గొణిగాడు రషీద్ మియా. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.