జాము పొద్దెక్కినా చిన్నరాణి మాధవీదేవి నిద్ర నుంచి మేల్కొనలేదు. పరిచారికలకు ఏమి పాలుపోలేదు. ఆమెకు నిద్రాభంగం చేసే సాహసం ఎవ్వరికీ లేదు. రాణికి ఎంతో సన్నిహితంగా వుండే ప్రియచెలి సరస్వతే ఎంతో ఆందోళనకు గురైంది.
తీరా నిద్ర లేచాక ఇంత పొద్దెక్కేదాకా తనను గాఢ నిద్రలో ఉంచినందుకు చిన్నరాణి ఏమంటుందో? మేల్కొల్పితే ఏం చికాకుపడి కోపం చేస్తుందో? సేవికలందరూ ఎటూ తోచక కొట్టుమిట్టాడుతున్నారు.
అందునా ఇవాళ నవరాత్రీ ఉత్సవాల ఆరంభ దినం. ఈ దినాన అవంతీ పట్టణమంతా కోలాహలంగా ఉంటుంది. ఏవో కొత్త శక్తులు ఆవహించిన విధంగా పౌరులందరూ ఎంతో ఉద్విగ్నంగా ఉంటారు. కానీ, ఈ తొమ్మిది రోజులూ రాత్రిoబవళ్ళు రాజవంశంలోని ఆబాల గోపాలమూ ఉత్సాహంగా గడుపుతారు.
- ధనికొండ హనుమంతరావు