స్లేయ్ - వైపర్ చాల చిన్న పాము. ఆఫ్రికా అడవుల్లోనూ, అమెరికా మిసిసిపి నది పరీవాహిక ప్రాంతాల్లోనూ ఉంటుంది. చిటికెన వెలి సైజులో ఉన్న దాని ఆకారం చూసి నిరపాయకరమైనదని భావిస్తే అంత కన్నా పొరపాటు ఉండదు. కుడితే మనిషి పాములా మెలికలు తిరగాలిసిందే. త్రాచుపాము ఆకారంలో ఉండే ఇది, నాగజాతికి చెందినది కాకపోయినా, కన్నడలో దీనిని "మిన్నాగు" అంటారు.
ప్రస్తుతం అది ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది.
"అతడి అసలు పేరేమిటో ఎవరికి తెలీదు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలకు సంబందించిన వాడంటారు కొందరు. అది ఎంతవరకూ నిజమో తెలీదు" అన్నాడు సెంట్రల్ బ్యూరో చీఫ్ సీతాపతి పరమేశ్వరన్. ఆఫీసర్లు శ్రద్ధగా వింటూ ఉండగా ఆ టెర్రరిస్టు గురించి చెప్పటం కొనసాగించాడు......" ఒక్కో చోట ఒక్కో పేరు...! కాశ్మీర్లో మిజ్రడిన్..... కేరళలో నాజియా... ఆంధ్రలో గుల్జార్...! ఆ మూడు కలిపి మనం అతడికి పెట్టిన కోడ్ - నేమ్ "మిడినాగు".......!"
-యండమూరి వీరేంద్రనాథ్.