ఈ నవల పూర్తిగా కొత్త నవల. ఇతివృత్తంలోను, శైలిలోను పూర్తిగా భిన్నమైనది. విలక్షణమైనది. పాత్రలు సజీవంగా ఉన్నాయి. కథనం బ్రహ్మాండంగా ఉంది. చాలా వాస్తవికంగా ఉంది. చదివించేలా ఉంది. నేను ఏకబిగిన చదవగలిగాను. మసాలా రచయితల్నీ, శక్తి తక్కువ, ఉబలాటం ఎక్కువ వున్న రచయితల్నీ, కుక్క మూతి పిందె ఎడిటర్లనీ, వెన్నుముక ఉందని మర్చిపోయే సంపాదకుల్నీ చక్కని వెలుతురులో రచయిత చూపించాడు. ఒకటి మరోకటికి ఎలా దారితీస్తుందో చూపించాడు. కొన్నింటిని మనం అసహ్యించుకునేవే అయినా కోకుండా, కొనేలా కాకుండా చాలా నిగ్రహంగా చెప్పాడు.
ముగింపు జరుగుతుందో లేదో గాని జరగాలని ఆశిస్తున్నాడు రచయిత. దీన్ని wishingful thinking అంటారు. కొత్త మార్గంలో పయనించి విఫలులైన వారిని చూసి మనం భయపడినట్టు, పాత మార్గంలో నడిచి విఫలులైన వారిని చూసి భయపడము. ఎందుకంటే పాతలో ముందు కొందరైనా విజయం పొందివుంటారు. కొత్త మార్గంలో రచనలు కొద్దిగాను, ఒక రచనలో కొత్త కొద్దిగాను వుంటుంది. కాని ఈ నవలా రచనంతా పూర్తిగా కొత్త కొత్తగా నడిచిన అతి కొద్ది రచనల్లో ఒకటి.
- డా కవన శర్మ
ఈ నవల పూర్తిగా కొత్త నవల. ఇతివృత్తంలోను, శైలిలోను పూర్తిగా భిన్నమైనది. విలక్షణమైనది. పాత్రలు సజీవంగా ఉన్నాయి. కథనం బ్రహ్మాండంగా ఉంది. చాలా వాస్తవికంగా ఉంది. చదివించేలా ఉంది. నేను ఏకబిగిన చదవగలిగాను. మసాలా రచయితల్నీ, శక్తి తక్కువ, ఉబలాటం ఎక్కువ వున్న రచయితల్నీ, కుక్క మూతి పిందె ఎడిటర్లనీ, వెన్నుముక ఉందని మర్చిపోయే సంపాదకుల్నీ చక్కని వెలుతురులో రచయిత చూపించాడు. ఒకటి మరోకటికి ఎలా దారితీస్తుందో చూపించాడు. కొన్నింటిని మనం అసహ్యించుకునేవే అయినా కోకుండా, కొనేలా కాకుండా చాలా నిగ్రహంగా చెప్పాడు. ముగింపు జరుగుతుందో లేదో గాని జరగాలని ఆశిస్తున్నాడు రచయిత. దీన్ని wishingful thinking అంటారు. కొత్త మార్గంలో పయనించి విఫలులైన వారిని చూసి మనం భయపడినట్టు, పాత మార్గంలో నడిచి విఫలులైన వారిని చూసి భయపడము. ఎందుకంటే పాతలో ముందు కొందరైనా విజయం పొందివుంటారు. కొత్త మార్గంలో రచనలు కొద్దిగాను, ఒక రచనలో కొత్త కొద్దిగాను వుంటుంది. కాని ఈ నవలా రచనంతా పూర్తిగా కొత్త కొత్తగా నడిచిన అతి కొద్ది రచనల్లో ఒకటి. - డా కవన శర్మ© 2017,www.logili.com All Rights Reserved.