ది గాడ్ ఫాదర్
న్యూ యార్క్ మహానగరం.
మూడో నెంబర్ క్రిమినల్ కోర్ట్ ఆవరణ.
ఆవరణలో చాలా మంది మనుష్యులు వేచి ఉన్నారు. న్యాయమూర్తి రాక కొరకు వాళ్లు పడిగాపులు పడుతున్నారు. వారిలో అమెరిగో బోనసేరా ఒకడు.
అతడు పగతో రగిలిపోతున్నాడు.
అతడి కూతురును కౄరంగా గాయపరిచారు. ఆ బిడ్డ ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. అతడి కూతురు మర్యాదను మట్టిపాలు చేయాలని ప్రయత్నించారు.
న్యాయమూర్తి దిగబడ్డాడు. ఆయన భారీకాయుడు. న్యాయమూర్తి నల్లటివీ, పొడవు పాటివీ దుస్తులు ధరించాడు. తన ఎదుట నిలబడిన ఇద్దరు యువకులను పవిత్రీకరించే ఉద్దేశ్యంతోనే ఆయన తన ఆసనంలో కూర్చున్నట్టు తోస్తోంది.
న్యాయమూర్తి మొహంలో ఎటువంటి భావాలూ లేవు. న్యాయమూర్తిగా సంతృప్తి చెందుతున్నట్టు ఉంది ఆయన మొహం. తన కూతురు విషయంలో ఆయన న్యాయసమ్మతమైన తీర్పును ఇవ్వడేమో అని అమెరిగో బోనసేరాకు తోస్తోంది. తన మనస్సు ఎందుకలా భావిస్తోందో అతడికే కావడంలేదు. అ
న్యాయమూర్తి ఎదుట ఉన్న ఇద్దరు యువకులూ గుడ్లప్పగించి న్యాయమూర్తినే చూస్తున్నారు.
వాళ్లను పరిశీలనగా చూస్తూ, “మీరు అసలు మనుష్యులేనా? మీ ప్రవర్తనకు మీకు సిగ్గనిపించడంలేదా?” అంటూ, న్యాయమూర్తి కోపం వ్యక్తం చేశాడు. యువకులు భిన్నులైపోయారు. పశ్చాత్తాపంతో కాబోలు తలలు దించుకున్నారు. మాట పడిపోయినవారి మాదిరిగా వారు కిక్కురుమనడంలేదు.
"ఆమాత్రం చాలు. మీలో కొంత మార్పు వచ్చింది. మిమ్మల్ని పశ్చాత్తాపం దహిస్తోంది. ఆమెను లైంగికంగా వేధించలేదు కాబట్టి సరిపోయింది. తీవ్రంగా గాయపరచిన విషయం అలా ఉంచుతాను. మీరు ఇరవై సంవత్సరాల జైలు జీవితం గడపబోయేవారు. అయినప్పటికీ మీ ఇద్దరి మీదా పాత నేరాలు ఎటువంటివీ మోపబడి లేవు. అందువల్లనే మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. నిర్దోషులుగా విడుదల చేస్తున్నాను" అన్నాడు న్యాయమూర్తి.............
ది గాడ్ ఫాదర్ న్యూ యార్క్ మహానగరం. మూడో నెంబర్ క్రిమినల్ కోర్ట్ ఆవరణ. ఆవరణలో చాలా మంది మనుష్యులు వేచి ఉన్నారు. న్యాయమూర్తి రాక కొరకు వాళ్లు పడిగాపులు పడుతున్నారు. వారిలో అమెరిగో బోనసేరా ఒకడు. అతడు పగతో రగిలిపోతున్నాడు. అతడి కూతురును కౄరంగా గాయపరిచారు. ఆ బిడ్డ ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. అతడి కూతురు మర్యాదను మట్టిపాలు చేయాలని ప్రయత్నించారు. న్యాయమూర్తి దిగబడ్డాడు. ఆయన భారీకాయుడు. న్యాయమూర్తి నల్లటివీ, పొడవు పాటివీ దుస్తులు ధరించాడు. తన ఎదుట నిలబడిన ఇద్దరు యువకులను పవిత్రీకరించే ఉద్దేశ్యంతోనే ఆయన తన ఆసనంలో కూర్చున్నట్టు తోస్తోంది. న్యాయమూర్తి మొహంలో ఎటువంటి భావాలూ లేవు. న్యాయమూర్తిగా సంతృప్తి చెందుతున్నట్టు ఉంది ఆయన మొహం. తన కూతురు విషయంలో ఆయన న్యాయసమ్మతమైన తీర్పును ఇవ్వడేమో అని అమెరిగో బోనసేరాకు తోస్తోంది. తన మనస్సు ఎందుకలా భావిస్తోందో అతడికే కావడంలేదు. అ న్యాయమూర్తి ఎదుట ఉన్న ఇద్దరు యువకులూ గుడ్లప్పగించి న్యాయమూర్తినే చూస్తున్నారు. వాళ్లను పరిశీలనగా చూస్తూ, “మీరు అసలు మనుష్యులేనా? మీ ప్రవర్తనకు మీకు సిగ్గనిపించడంలేదా?” అంటూ, న్యాయమూర్తి కోపం వ్యక్తం చేశాడు. యువకులు భిన్నులైపోయారు. పశ్చాత్తాపంతో కాబోలు తలలు దించుకున్నారు. మాట పడిపోయినవారి మాదిరిగా వారు కిక్కురుమనడంలేదు. "ఆమాత్రం చాలు. మీలో కొంత మార్పు వచ్చింది. మిమ్మల్ని పశ్చాత్తాపం దహిస్తోంది. ఆమెను లైంగికంగా వేధించలేదు కాబట్టి సరిపోయింది. తీవ్రంగా గాయపరచిన విషయం అలా ఉంచుతాను. మీరు ఇరవై సంవత్సరాల జైలు జీవితం గడపబోయేవారు. అయినప్పటికీ మీ ఇద్దరి మీదా పాత నేరాలు ఎటువంటివీ మోపబడి లేవు. అందువల్లనే మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. నిర్దోషులుగా విడుదల చేస్తున్నాను" అన్నాడు న్యాయమూర్తి.............© 2017,www.logili.com All Rights Reserved.