మధ్యాహ్నం మొదలైన వాన సాయంత్రం ఐదు గంటలకు ఆగింది. మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు తిరిగి తీక్షణంగా ప్రకాశించసాగాడు. భూమి చల్లబడినందువల్ల సూర్యుని వేడి బాధావహంగా లేదు.... మనసుకు ఎంతో ఆహ్లాదంగా వుంది.
ఇంతసేపు ఈ యింట్లో కూర్చొని వర్షధారలను చూస్తూ కూర్చున్న సూర్యం, బంగళా బైటికి వొచ్చి నిలబడ్డాడు. తోటలోని మొక్కలన్నీ స్నానం చేసి హాయిగా వీచే పిల్లగాలులకు తల లుపుతున్నయ్. చెట్ల మిద మిగిలిపోయిన నీటి చుక్కల్లో సూర్యకిరణాలు ధగధగా ప్రకాశిస్తున్నాయ్. ఉండి ఉండి సన్నని తుప్పరగా చెట్లమిాది నీటి బిందువులు నేలకు రాలుతున్నవి.
ఈ వాతావరణంలో తోటంతా పరుగెత్తా లనిపించింది సూర్యానికి; మొక్కలతో ఆడుకోవాలనిపించింది... కాని, తన వయస్సు! నలభై వర్ష ఋతువుల్ని చూసిన తను చిన్న పిల్లాడిలాగు, అల్లరి చిల్లరగా ఆడుకోవటం ఏమిటి! ఎవరైనా చూస్తే నవ్వక తప్పదు!... కాని తనకీ వింత వూహ ఎందుకు కలగాలి? ఊహలకు ఒక దారీ తెన్నూ వుండక్కర్లేదు కాబోలు!
- ధనికొండ హనుమంతరావు