మహాకవి బాణుడు సంస్కృతంలో రచించిన 'కాదంబరి' భారతీయ సాహిత్యానికి తొలినవల. అచ్చెరువు కలిగించే ఆ సృజనాత్మకతను తేలికైన మాటల్లో తెలుగు పాఠకులకు అందించే నిమిత్తం విద్వాన్ విశ్వం గారు చేసిన ప్రయత్నం తెలుగు సాహిత్యానికి వెలలేని ఆభరణం.
కిరితార్జునీయానికీ, మేఘసందేశానికీ, దశకుమారచరిత్రకూ, కాదంబరికీ ప్రాచీన నవీన ప్రబంధాలు కొన్నిటికి ఏకైకంగానూ, మరి కొన్నిటికనేకంగానూ ఉన్నవి. కాదంబరికి సంస్కృతంలోనే మోతాదు కాదంబరులు ఎకాధికంగానే ఉన్నవి. తెలుగులోనూ కాదంబరీ నాటకమని ఒకటి విన్నానుగానీ, అచ్చులో చూడలేదు. తెలుగు కాదంబరీ ప్రబంధం కేతనదంటూ, దానిలోని ఒకటి రెండు పద్యాలు శ్రీ మానవల్లి రామకృష్ణయ్యగారు కుమారసంభవము అర్థవివరణంలో ఉదాహరించారు. ఈ ప్రబంధాలన్నిటికీ ప్రయోజనం లేదనలేము గానీ అది చాలా తక్కువ. ఎంచేతనంటే వీనిలో చాలా ప్రబంధాలు కథామాత్రాన్నే మాత్రా ప్రమాణంలో తెలిపినవి కానీ, కవి హృదయంతో మనకు పరిచయం కలిగించలేదు.
బాణవేగంతో పాటు పయనించి, ప్రపంచపు పొలిమేరలు చూడదలచుకొంటారా? లేక భావనాసమాధిలోని ఆనందం అనుభవించ దలుస్తారా? లేక బహిప్రపంచమూ అంతఃప్రపంచమూ ఈ రెండిటి వైవిధ్యమూ చూడదలచుకొంటారా? లేక మూడిటినీ దలచుకొంటారా? మీ ఇష్టం. విద్వాన్ విశ్వం సాయంతో చూడండి - తప్పక చూడగలరు.
- వేలూరి శివరామశాస్త్రి గారు
మహాకవి బాణుడు సంస్కృతంలో రచించిన 'కాదంబరి' భారతీయ సాహిత్యానికి తొలినవల. అచ్చెరువు కలిగించే ఆ సృజనాత్మకతను తేలికైన మాటల్లో తెలుగు పాఠకులకు అందించే నిమిత్తం విద్వాన్ విశ్వం గారు చేసిన ప్రయత్నం తెలుగు సాహిత్యానికి వెలలేని ఆభరణం. కిరితార్జునీయానికీ, మేఘసందేశానికీ, దశకుమారచరిత్రకూ, కాదంబరికీ ప్రాచీన నవీన ప్రబంధాలు కొన్నిటికి ఏకైకంగానూ, మరి కొన్నిటికనేకంగానూ ఉన్నవి. కాదంబరికి సంస్కృతంలోనే మోతాదు కాదంబరులు ఎకాధికంగానే ఉన్నవి. తెలుగులోనూ కాదంబరీ నాటకమని ఒకటి విన్నానుగానీ, అచ్చులో చూడలేదు. తెలుగు కాదంబరీ ప్రబంధం కేతనదంటూ, దానిలోని ఒకటి రెండు పద్యాలు శ్రీ మానవల్లి రామకృష్ణయ్యగారు కుమారసంభవము అర్థవివరణంలో ఉదాహరించారు. ఈ ప్రబంధాలన్నిటికీ ప్రయోజనం లేదనలేము గానీ అది చాలా తక్కువ. ఎంచేతనంటే వీనిలో చాలా ప్రబంధాలు కథామాత్రాన్నే మాత్రా ప్రమాణంలో తెలిపినవి కానీ, కవి హృదయంతో మనకు పరిచయం కలిగించలేదు. బాణవేగంతో పాటు పయనించి, ప్రపంచపు పొలిమేరలు చూడదలచుకొంటారా? లేక భావనాసమాధిలోని ఆనందం అనుభవించ దలుస్తారా? లేక బహిప్రపంచమూ అంతఃప్రపంచమూ ఈ రెండిటి వైవిధ్యమూ చూడదలచుకొంటారా? లేక మూడిటినీ దలచుకొంటారా? మీ ఇష్టం. విద్వాన్ విశ్వం సాయంతో చూడండి - తప్పక చూడగలరు. - వేలూరి శివరామశాస్త్రి గారు© 2017,www.logili.com All Rights Reserved.