ఆయిటి మొదలు ఉర్ములు కొత్తజీతగాలు సెల్కలు పొలాలు అద్దురాళ్ళు మీన అదిరిపడి, ఎదురుజూసిన కళ్లల సూరులు సెంద్రులు నల్లబడుతున్న ఆకాశం మీన అందీ అందని మొగ్గు తెప్పల తెప్పలుగా ఉర్ముతున్న కొద్దీ కనపడని రథం ఎన్నటి సామెత అయ్యమ్మ కత.
"ఓరీ పిలగా కక్కా! ఉర్ములు మెరపులు ఒకంత కత కాద్రా బాడ్కావ్ ఓరయ్యా! ఒకనాటి కిష్టుడు అర్జుండు రదం ఉరికిస్తున్న సైమాన ఆల్ల అయ్యమ్మలు సెపదం చేసిండ్ర౦టర! మడ్తనబుట్నోల్లనుమడ్సకరా! ఎద్రుగాల్ల బుట్నోల్లను ఎదుర్కరా"! ఓరయ్యా పోర్గా! ఆల్లరదం సాయిసీలలు " ఊడిపడ్డప్పుడు ఉర్ముపాటు కింద భూమికమిలి పెచ్చరిల్లిన పిడ్గురాయ్యా..! మీ అయ్య ఓ ఆసామ్కి తాపెదారికింద జీతముండి బుర్దపొలంలో నాగలి దుంతుంటే ఎర్రదేలు గర్సి సల్లజెమ్టలు బట్టి ఇంటికొత్తే ఏ వైద్యం మనసంటోల్ల కందుబాట్లుండే గప్పుడు అడ్డెడన్ని ఉల్వలు ఇసుర్రాయితో ఇసిరి కoకెడు కoకెడు పిండితోటి వొల్లంత రుద్దిన అట్టైన అల్విగాకపోయె! ఏపాకంత నమ్లించినం నిమ్మకాయల్లు తిప్పేసినం అట్లెయిన సుతాయించుకోలె! అరమ్మకోరి సేరదీస్నం! నీట్లగర్సిన తేలిసం వొల్లంత నిండింది. నోటిగుంట నుర్సుల నుర్పులు కక్కబట్టిండు. ఏం జేత్తుం కొడ్కా...! ఆగమాగమైతిమి.
ఇలా ఈ కత సాగుతుంది. దళితుల ఆవేదనను ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేశారు. "కక్క" ఈ నవల ఒకప్పటి దళిత పోరాటాన్ని తెల్పుతుంది.
- వేముల ఎల్లయ్య
ఆయిటి మొదలు ఉర్ములు కొత్తజీతగాలు సెల్కలు పొలాలు అద్దురాళ్ళు మీన అదిరిపడి, ఎదురుజూసిన కళ్లల సూరులు సెంద్రులు నల్లబడుతున్న ఆకాశం మీన అందీ అందని మొగ్గు తెప్పల తెప్పలుగా ఉర్ముతున్న కొద్దీ కనపడని రథం ఎన్నటి సామెత అయ్యమ్మ కత. "ఓరీ పిలగా కక్కా! ఉర్ములు మెరపులు ఒకంత కత కాద్రా బాడ్కావ్ ఓరయ్యా! ఒకనాటి కిష్టుడు అర్జుండు రదం ఉరికిస్తున్న సైమాన ఆల్ల అయ్యమ్మలు సెపదం చేసిండ్ర౦టర! మడ్తనబుట్నోల్లనుమడ్సకరా! ఎద్రుగాల్ల బుట్నోల్లను ఎదుర్కరా"! ఓరయ్యా పోర్గా! ఆల్లరదం సాయిసీలలు " ఊడిపడ్డప్పుడు ఉర్ముపాటు కింద భూమికమిలి పెచ్చరిల్లిన పిడ్గురాయ్యా..! మీ అయ్య ఓ ఆసామ్కి తాపెదారికింద జీతముండి బుర్దపొలంలో నాగలి దుంతుంటే ఎర్రదేలు గర్సి సల్లజెమ్టలు బట్టి ఇంటికొత్తే ఏ వైద్యం మనసంటోల్ల కందుబాట్లుండే గప్పుడు అడ్డెడన్ని ఉల్వలు ఇసుర్రాయితో ఇసిరి కoకెడు కoకెడు పిండితోటి వొల్లంత రుద్దిన అట్టైన అల్విగాకపోయె! ఏపాకంత నమ్లించినం నిమ్మకాయల్లు తిప్పేసినం అట్లెయిన సుతాయించుకోలె! అరమ్మకోరి సేరదీస్నం! నీట్లగర్సిన తేలిసం వొల్లంత నిండింది. నోటిగుంట నుర్సుల నుర్పులు కక్కబట్టిండు. ఏం జేత్తుం కొడ్కా...! ఆగమాగమైతిమి. ఇలా ఈ కత సాగుతుంది. దళితుల ఆవేదనను ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేశారు. "కక్క" ఈ నవల ఒకప్పటి దళిత పోరాటాన్ని తెల్పుతుంది. - వేముల ఎల్లయ్య© 2017,www.logili.com All Rights Reserved.