ఫీలయ్యే వాళ్లకి ఈ ప్రపంచం ట్రాజెడీ. ఆలోచించే వాళ్లకి కామెడీ.
శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ఈ రెండు కలయిక. ఫీలైనది కథలుగా, నవలలుగా రాస్తే, ఆలోచించే వాటిని కౌముది డాట్ నెట్ లో 'కాలమ్ దాటని కబుర్లు'గా చాలా ఏళ్లుగా రాస్తున్నారు. దానికి గల టేగ్ లైన్, 'నెలనెలకీ కొన్ని కులాసా కులాసా కబుర్లు' చక్కగా సరిపోతుంది.
తెలుగు కామెడీ రాసేవారు తక్కువ. భూతద్దంలో వెదికితే ముగ్గురు రచయిత్రలే కనిపించారు. శ్రీయతులు భానుమతి రామకృష్ణ, పొత్తూరి విజయలక్ష్మి, ఇప్పుడీ బలభద్రపాత్రుని రమణి. కౌముదిలో నేను మొదటగా చదివిన శీర్షిక ఇదే.
కామెడీ కథో, నవలో రాయడం కన్నా కాలం రాయడం కష్టమైన పని. ఈ పుస్తకంలో కబుర్లు చదివితే ఎవరికైనా తెలుస్తుంది. ఈ వ్యాసాల్లో రమణి గారు తనకి పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లని, వారి మధ్య జరిగిన హాస్య సంఘటనలని అనేకం పేర్కొన్నారు.
ఈ వ్యాసాల్లో మనం అనేక మంది ప్రముఖుల్ని కూడా కలుసుకోవచ్చు. ఈ పుస్తకం చదవడానికి ఒక సూచన - ఈ పుస్తకాన్ని నవలలా ఏకబిగిన చదవకండి. చాక్లెట్స్ చప్పరించినట్లు, ప్రతిదానికి మధ్య విరామం ఇచ్చి చదివితే చక్కగా ఎంజాయ్ చేయగలరు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఫీలయ్యే వాళ్లకి ఈ ప్రపంచం ట్రాజెడీ. ఆలోచించే వాళ్లకి కామెడీ. శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ఈ రెండు కలయిక. ఫీలైనది కథలుగా, నవలలుగా రాస్తే, ఆలోచించే వాటిని కౌముది డాట్ నెట్ లో 'కాలమ్ దాటని కబుర్లు'గా చాలా ఏళ్లుగా రాస్తున్నారు. దానికి గల టేగ్ లైన్, 'నెలనెలకీ కొన్ని కులాసా కులాసా కబుర్లు' చక్కగా సరిపోతుంది. తెలుగు కామెడీ రాసేవారు తక్కువ. భూతద్దంలో వెదికితే ముగ్గురు రచయిత్రలే కనిపించారు. శ్రీయతులు భానుమతి రామకృష్ణ, పొత్తూరి విజయలక్ష్మి, ఇప్పుడీ బలభద్రపాత్రుని రమణి. కౌముదిలో నేను మొదటగా చదివిన శీర్షిక ఇదే. కామెడీ కథో, నవలో రాయడం కన్నా కాలం రాయడం కష్టమైన పని. ఈ పుస్తకంలో కబుర్లు చదివితే ఎవరికైనా తెలుస్తుంది. ఈ వ్యాసాల్లో రమణి గారు తనకి పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లని, వారి మధ్య జరిగిన హాస్య సంఘటనలని అనేకం పేర్కొన్నారు. ఈ వ్యాసాల్లో మనం అనేక మంది ప్రముఖుల్ని కూడా కలుసుకోవచ్చు. ఈ పుస్తకం చదవడానికి ఒక సూచన - ఈ పుస్తకాన్ని నవలలా ఏకబిగిన చదవకండి. చాక్లెట్స్ చప్పరించినట్లు, ప్రతిదానికి మధ్య విరామం ఇచ్చి చదివితే చక్కగా ఎంజాయ్ చేయగలరు. - మల్లాది వెంకట కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.