ఎలనాగగారి ప్రజ్ఞ బహుముఖీనమైనది కావటం వల్ల అది అనువాదరంగం వైపు కూడా విస్తరించింది. ఆంగ్లంలోకి కూడా వారు సాహిత్య రచనలను అనువదించారు. కథా ప్రపంచానికి వస్తే లాటిన్ అమెరికన్ కథలలో కొన్నింటిని తెనిగించి ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు పేరుతో ప్రచురించుట జరిగింది. తర్వాత కొన్ని ఆఫ్రికన్ కథలను అనువదించి ఉత్తమ ఆఫ్రికన్ కథలు పుస్తకంగా ప్రచురించారు. అట్లే ప్రఖ్యాత రచయిత సోమర్స్ ట్ మామ్ రచించిన కథల్లో కొన్నింటిని ఎంపిక చేసి సోమర్స్ ట్ మామ్ కథలు పేరుతో ప్రచురించారు. ప్రస్తుతం ఈ కథాతోరణం కూడా దేశవిదేశాలలోని సుప్రసిద్ద రచయితల కథల అనువాదాల సంపుటే.
ఈ కథల ద్వారా కొత్త వాతావరణంలో పాటు వస్తు వైవిద్యం వున్న కథలను చదవటం పాఠకుడిని కొత్త అనుభవాన్నిస్తుంది. మూస కథలకు అలవాటు పడివుంటే దానినుంచి విముక్తి కూడా లభిస్తుంది.
శ్రమకోర్చి అనువాదం చేసిన ఎలనాగగారిని అభినందిస్తూ తీర్పరులైన పాఠకులను ఈ అక్షర ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాను.
- డా. అమ్మంగి వేణుగోపాల్