ఆ అమ్మాయికి హఠాత్తుగా మెలుకువ వొచ్చింది. గాబరాగా హంసతూలికాతల్పం మీద నుంచి లేచి నిలబడింది. చుట్టూ కలయజూచింది. అది తన గదే! కంటికి ఇంపుగా ఉండే దీపాలు వెలుగుతూనే వున్నవి. సువాసనలతో గది నిండి వుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్న యీ వాతావరణంలో సుఖంగా నిద్రపొయ్యేందుకు మారుగా, ఆమె భయంతో లేచింది.
వాతావరణంలో మార్పులేదు. ప్రస్తుతానికి తనకొచ్చిన ప్రమాదమేమీ లేదని నిశ్చయంగా తెలుసుకుంది. కాని తనను వెన్నాడే యీ భయం ఏమిటి?
గత సాయంత్రం నుంచే తననీ ప్రాణభయం తరుముకొస్తూ వుంది. ఇరాన్ - తన ఆచార్యుడు, వేదాంతి, తనపట్ల పుత్రికా వాత్సల్యాన్ని వర్షిస్తూ తన అభిమాన అనురాగాల్ని పొందగలిగే పురుషోత్తముడు, కొన్నాళ్ళుగా తనకో కథ చెపుతూ వొచ్చాడు. ఆ కథ ఎంతో అద్భుతంగానూ, రసమయంగానూ వున్నది.
కథంతా రాజ కుటుంబానికి చెందింది. రాజ్యం కోసం, అధికారం కోసం రాజవంశీయులు ఒకర్నొకరు హత్య చేసుకోవటం జరుగుతుంది. తల్లిని కొడుకు నమ్మలేడు; చెల్లెల్ని అన్న నమ్మడు. ఒకరికొకరు విరోధులు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించేందుకైనా వీలులేని వాతావరణంలో వారు బతుకుతారు.
- ధనికొండ హనుమంతరావు