"ఏమోయ్ సత్యం! ఊరికెనే వున్నావుగదా, కాస్త మాకు ప్రూఫులు చూసి పెట్టరాదు?" అన్నాడు నారాయణశాస్త్రి.
నారాయణశాస్త్రి తనకు ఉద్యోగం ఇస్తున్నాడని సత్యం వెంటనే గ్రహించలేదు.
"ఎం ప్రూఫులు?" అన్నాడు సత్యం.
"నీకు చెప్పలేదు ? భాగవతం ఒక్కొక్క స్కంధమే ఒక్కొక్క చిన్న పుస్తకంగా అచ్చు వేయిస్తున్నా. మన సీత ప్రెస్ లోనే. నెలకో పాతికదాకా ఇచ్చుకుంటాను ." అన్నాడు నారాయణశాస్త్రి.
సత్యంలో ఎదో మీట నొక్కినట్టయింది. అది ఆనందమో, ఆందోళనొ అతనికే తెలీదు. ఒక స్థితిలో రెంటికి తేడా ఉండదు. సత్యం ఆ స్థితిలో ఉన్నాడు.
నెలకు పాతిక తనకు మంచి సంపాదనే. చాలా మాసాలుగా తాను, తన భార్యా నెలకు పది పదిహేను రూపాయలపైనే బతుకుతున్నారు. అది ఎట్లా వస్తున్నది అతనికే తెలీదు. తిండి లేకుండా పడుకున్న పూట మాత్రం తన జీవితం అడుగంటినట్టు స్పష్టంగా తెలిసేది. మళ్ళి ఒక రూపాయి ఎక్కడన్నా పుటించేసరికి అడుగు కనిపించకుండా పోయి అంతా మామూలుగానే ఉన్నట్టుండేది . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.