అనంతపురంలో పుట్టిపెరిగిన శ్రీమతి షెహనాజ్ గారు రచయిత్రిగా ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారనేది వాస్తవం. కథారచయిత్రిగా మూడు కథా సంపుటాలు వెలువరించిన షెహనాజ్ గారు నవలా ప్రక్రియను చేపట్టి 'మానస బాంధవ్యం' అనే నవలను పాఠకులకు అండజేసినందుకు నా అభినందనలు. కుటుంబవ్యవస్థ దారి తప్పిపోతోందనే ఆవేదనను రచయిత్రి విభిన్న పాత్రల ద్వారా, భిన్నకోణాల నుంచి ఈ నవలలో చిత్రీకరించారు.
ఈ నవలలో మూడు కుటుంబాలున్నాయి. ఈ నవలలో నాయకుడు సిద్ధార్థ. అతని చుట్టూనే నవలను నడిపించారు రచయిత్రి. వసుంధర కుటుంబం మొదటిది. రెండవది సిద్ధార్థ కుటుంబం. మూడవది కిరణ్ కుటుంబం. కుటుంబవ్యవస్థలో రాజీమార్గం రాజమార్గం అని, మానసబాంధవ్యం తప్పదని, మనుషులు విడిపోయినా మనసులు విడిపోవని, అయినా గతాన్ని తలచుకుంటూ జీవితాన్ని నరకం చేసుకోవద్దని సందేశం అందించారు ఈ నవల ద్వారా షెహనాజ్ గారు.
ఆయా పాత్రలు మన కళ్ళముందు నిలిచి, కొన్ని సందర్భాలలో మనసుల్ని ఉద్వేగపరిచినా - చివరికి 'కుటుంబవ్యవస్థ బీటలు వారుతుంది...జాగ్రత్త!' అనే హెచ్చరిక రచయిత్రి తన బాధ్యతగా ఈ నవలలో అంతర్లీనంగా ధ్వనింపజేశారు.
అనంతపురంలో పుట్టిపెరిగిన శ్రీమతి షెహనాజ్ గారు రచయిత్రిగా ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారనేది వాస్తవం. కథారచయిత్రిగా మూడు కథా సంపుటాలు వెలువరించిన షెహనాజ్ గారు నవలా ప్రక్రియను చేపట్టి 'మానస బాంధవ్యం' అనే నవలను పాఠకులకు అండజేసినందుకు నా అభినందనలు. కుటుంబవ్యవస్థ దారి తప్పిపోతోందనే ఆవేదనను రచయిత్రి విభిన్న పాత్రల ద్వారా, భిన్నకోణాల నుంచి ఈ నవలలో చిత్రీకరించారు. ఈ నవలలో మూడు కుటుంబాలున్నాయి. ఈ నవలలో నాయకుడు సిద్ధార్థ. అతని చుట్టూనే నవలను నడిపించారు రచయిత్రి. వసుంధర కుటుంబం మొదటిది. రెండవది సిద్ధార్థ కుటుంబం. మూడవది కిరణ్ కుటుంబం. కుటుంబవ్యవస్థలో రాజీమార్గం రాజమార్గం అని, మానసబాంధవ్యం తప్పదని, మనుషులు విడిపోయినా మనసులు విడిపోవని, అయినా గతాన్ని తలచుకుంటూ జీవితాన్ని నరకం చేసుకోవద్దని సందేశం అందించారు ఈ నవల ద్వారా షెహనాజ్ గారు. ఆయా పాత్రలు మన కళ్ళముందు నిలిచి, కొన్ని సందర్భాలలో మనసుల్ని ఉద్వేగపరిచినా - చివరికి 'కుటుంబవ్యవస్థ బీటలు వారుతుంది...జాగ్రత్త!' అనే హెచ్చరిక రచయిత్రి తన బాధ్యతగా ఈ నవలలో అంతర్లీనంగా ధ్వనింపజేశారు.© 2017,www.logili.com All Rights Reserved.