అది సాయంకాల సమయం. ఆకాశం కొద్దికొద్దిగా ఎర్రగా కనిపిస్తోంది. ఒక కొండ ప్రక్కన నిశ్శబ్దముగానున్న మైదానములో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. అందులో ఒకడు వీరేంద్రసింహుడు, మరొకరు తేజసింహుడు. ఇద్దరు ఒక రాతి బండమీద కూర్చుని పరస్పరం సంభాషించుకొంటున్నారు.
వీరేంద్రసింహుని వయస్సు ఇరవై ఒకటో, ఇరవై రెండో వుంటుంది. ఇతడు నౌగాడ చక్రవర్తియైన సురేంద్రసింహునికి ఒక్కగానొక్క కొడుకు. తేజసింహుడు సురేంద్రసింహుని మంత్రియైన జితసింహుని ప్రియా పుత్రుడు. అంతేగాక యువకుడైన వీరేంద్రసింహునికి ప్రాణ మిత్రుడు కూడా. తేజ సింహుడు మంచి చురుకైనవాడు.
- బోలానాథ్