Parisku Po!

By Jayakantan (Author), Jillella Balaji (Author)
Rs.200
Rs.200

Parisku Po!
INR
PALLAVI065
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఒక సద్భ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కథా నాయకుడు చిన్నప్పుడే ప్యారిస్ కు వెళ్లిపోయి అక్కడే పాశ్చాత్య సంగీతంలో వయోలిన్ నేర్చుకుని కొన్నేళ్ల తర్వాత... ఇండియాకు తిరిగొస్తాడు. అతడి పొడను ఏ మాత్రం ఇష్టపడని అతని తండ్రి సత్సంప్రదాయ నియంతృత్వపు ధోరణి అతణ్ణి మానసిక వేదనకు గురిచేసి ఒంటరివాణ్ణి చేస్తుంది. అతనికి ఓదార్పు ఏమైనా ఉందంటే... అది అతని తండ్రి స్నేహితుడి పడుచు భార్య అయిన లలిత స్నేహమే!

             ఆమె స్నేహం అతని బాధను దూరం చేసి ప్రేమను చిగురింప చేస్తుంది. ఆమె కూడా అతణ్ణి ఇష్టపడిందనే చెప్పాలి. కానీ తనను అమితంగా ఇష్టపడే భర్త సాన్నిధ్యం, భర్త కురిపించే స్వచ్ఛమైన ప్రేమ, సమాజంలో రచయిత్రిగా తనకున్న పేరు ప్రతిష్టలు, సంప్రదాయపు హద్దులు... వీటి సుడిగుండంలో చిక్కుకుని ఆమె ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమైపోతుంది. 

             చివరకు ఆమె తీసుకున్న నిర్ణయానికి అతను కూడా బద్దుడై మళ్లీ ప్యారిస్ కే తిరిగి వెళ్లిపోవటానికి నిర్ణయించుకుంటాడు. 

           ఈ నవలలో పాశ్చాత్య సంగీతానికి ఇప్పటి సంప్రదాయ సంగీతమూ, సినీ సంగీతమూ మధ్య నెలకొన్న వైరుధ్యాలనూ జయకాంతన్ వివరించిన తీరు అమోఘం. సంగీతం పై ఆయనకున్న అభిప్రాయాలు, ఆయన అద్భుతమైన విశ్లేషణ మనల్ని అబ్బురపరుస్తాయి. అలాగే కళలు, కళాకారుల పట్ల ఆయనకున్న అభిమానం అనన్యసామాన్యం. 

            మానవ సంబంధాలపై జయకాంతన్ రచించిన ఎన్నో నవలల్లో ఈ నవల ఒక ఆణిముత్యం. ఆశావహ దృక్పథంలో ఈ నవలను ముగించటం జయకాంతన్ కె చెల్లు!

                                                                                                                     - జయకాంతన్ 

            ఒక సద్భ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కథా నాయకుడు చిన్నప్పుడే ప్యారిస్ కు వెళ్లిపోయి అక్కడే పాశ్చాత్య సంగీతంలో వయోలిన్ నేర్చుకుని కొన్నేళ్ల తర్వాత... ఇండియాకు తిరిగొస్తాడు. అతడి పొడను ఏ మాత్రం ఇష్టపడని అతని తండ్రి సత్సంప్రదాయ నియంతృత్వపు ధోరణి అతణ్ణి మానసిక వేదనకు గురిచేసి ఒంటరివాణ్ణి చేస్తుంది. అతనికి ఓదార్పు ఏమైనా ఉందంటే... అది అతని తండ్రి స్నేహితుడి పడుచు భార్య అయిన లలిత స్నేహమే!              ఆమె స్నేహం అతని బాధను దూరం చేసి ప్రేమను చిగురింప చేస్తుంది. ఆమె కూడా అతణ్ణి ఇష్టపడిందనే చెప్పాలి. కానీ తనను అమితంగా ఇష్టపడే భర్త సాన్నిధ్యం, భర్త కురిపించే స్వచ్ఛమైన ప్రేమ, సమాజంలో రచయిత్రిగా తనకున్న పేరు ప్రతిష్టలు, సంప్రదాయపు హద్దులు... వీటి సుడిగుండంలో చిక్కుకుని ఆమె ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమైపోతుంది.               చివరకు ఆమె తీసుకున్న నిర్ణయానికి అతను కూడా బద్దుడై మళ్లీ ప్యారిస్ కే తిరిగి వెళ్లిపోవటానికి నిర్ణయించుకుంటాడు.             ఈ నవలలో పాశ్చాత్య సంగీతానికి ఇప్పటి సంప్రదాయ సంగీతమూ, సినీ సంగీతమూ మధ్య నెలకొన్న వైరుధ్యాలనూ జయకాంతన్ వివరించిన తీరు అమోఘం. సంగీతం పై ఆయనకున్న అభిప్రాయాలు, ఆయన అద్భుతమైన విశ్లేషణ మనల్ని అబ్బురపరుస్తాయి. అలాగే కళలు, కళాకారుల పట్ల ఆయనకున్న అభిమానం అనన్యసామాన్యం.              మానవ సంబంధాలపై జయకాంతన్ రచించిన ఎన్నో నవలల్లో ఈ నవల ఒక ఆణిముత్యం. ఆశావహ దృక్పథంలో ఈ నవలను ముగించటం జయకాంతన్ కె చెల్లు!                                                                                                                      - జయకాంతన్ 

Features

  • : Parisku Po!
  • : Jayakantan
  • : Pallavi Publications
  • : PALLAVI065
  • : Paperback
  • : 2019
  • : 227
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Parisku Po!

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam