"పేద జనం" నవలను, "స్వేత రాత్రులు " కథను రష్యన్ మహా నవలా రచయిత దోస్తాయేవస్కి 1840 దశకంలో తన సాహిత్యజీవితారంభ దశలోనే రచించాడు. సేంట్ పీటర్స్ బర్గ్ లో తను గడిపిన తొలి సంవత్సరాలను గురించి స్మరించుకొంటూ, ఆ కాలంలో నిగూఢంగా కనిపించే ఆ నగర విధుల్లో వచ్చే పోయే వారి ముఖాలు పరకాయించి చూస్తూ పరిభ్రమించడం తనకెంతో యిష్టంగా ఉండేదని, అదిగో ఆ సమయంలోనే యీ గ్రంథాగత భావాలు తన ఉహాపదంలో ఉద్భవించాయని దోస్తాయేవ్స్కి చెప్పాడు. యువ స్వప్నికుడు , సేంట్ పీటర్స్ బర్గ్ లో పొగమంచు ఆవరించిన ఒక సాయంత్రం, నగరంలో అంధకారంగా, మసిబారివున్న యిళ్లలో ఏమి జరుగుతూ ఉండి ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు, క్రూరమైన రష్యన్ జీవిత వాస్తవికత చేత అణచివేయ్యబడుతున్న నిజాయితీపరులైన పేదల బ్రతుకుల్లోని విషాదం అకస్మాత్తుగా అయన మస్సుకి గాఢంగా అనుభూతమైంది. అదిగో సరిగా ఆ భావమే అయన నవల "పేద జనం" కు ప్రాతిపదిక అయింది.