సినీ కళామతల్లి కంఠాభారణంలో ఆణిముత్యాలుగా మెరిసే గొప్ప సంగీత దర్శకులు ఎందరో వున్నారు. వారందరికీ వందనాలు. సంగీతపు, సాహిత్యపు కలనేతతో సృష్టించబడ్డ ఎన్నో మధురగీతాలు, మనస్సులో భావుకత్వాన్ని, కలల్నీ రేకెత్తిస్తాయి. 'పాట' అనేది అందరి 'నోట' పలికేది. సమిష్టి కృషితో వెలువడే సినీ గీతాలు చిరస్థాయిగా నిలబడే మధుర గీతాలుగా ఉండాలంటే అందుకు ఆ కళాకారులు ఎంతో శ్రమించాలి. ఆ సంఘర్షణ, శ్రమ ఎలా ఉంటుందనేది అందరికీ అర్థం కాదు. అలాంటి గొప్ప కళాకారులను తలచుకుంటూ సంగీత నేపధ్యంలో రాయబడ్డ 'రాగాలు మారాయి' అనే ఈ నవలను ఆదరించి, ఉత్తరాలు రాసిన పాఠకదేవుళ్ళకు నా వందనాలు.
రికార్డింగ్ ధియేటర్ల వివరాలు చెప్పిన శ్రీశ్రీ రమణగారికి కృతఙ్ఞతలు. ఈ సీరియల్ ను నవలగా ప్రచురించేటప్పుడు తెలుగు సినీ రంగంలోని సంగీత దర్శకుల గురించి కొన్ని వివరాలను కూడా దాంతోపాటు జతపరచాలని అనుకున్నాను. అందుకే నేను సేకరించిన వివరాలతో వ్యాసాలు వ్రాసి ఓ పుస్తకంలా జతపరుస్తున్నాను.
సినీ కళామతల్లి కంఠాభారణంలో ఆణిముత్యాలుగా మెరిసే గొప్ప సంగీత దర్శకులు ఎందరో వున్నారు. వారందరికీ వందనాలు. సంగీతపు, సాహిత్యపు కలనేతతో సృష్టించబడ్డ ఎన్నో మధురగీతాలు, మనస్సులో భావుకత్వాన్ని, కలల్నీ రేకెత్తిస్తాయి. 'పాట' అనేది అందరి 'నోట' పలికేది. సమిష్టి కృషితో వెలువడే సినీ గీతాలు చిరస్థాయిగా నిలబడే మధుర గీతాలుగా ఉండాలంటే అందుకు ఆ కళాకారులు ఎంతో శ్రమించాలి. ఆ సంఘర్షణ, శ్రమ ఎలా ఉంటుందనేది అందరికీ అర్థం కాదు. అలాంటి గొప్ప కళాకారులను తలచుకుంటూ సంగీత నేపధ్యంలో రాయబడ్డ 'రాగాలు మారాయి' అనే ఈ నవలను ఆదరించి, ఉత్తరాలు రాసిన పాఠకదేవుళ్ళకు నా వందనాలు. రికార్డింగ్ ధియేటర్ల వివరాలు చెప్పిన శ్రీశ్రీ రమణగారికి కృతఙ్ఞతలు. ఈ సీరియల్ ను నవలగా ప్రచురించేటప్పుడు తెలుగు సినీ రంగంలోని సంగీత దర్శకుల గురించి కొన్ని వివరాలను కూడా దాంతోపాటు జతపరచాలని అనుకున్నాను. అందుకే నేను సేకరించిన వివరాలతో వ్యాసాలు వ్రాసి ఓ పుస్తకంలా జతపరుస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.