షాడో సి ఐ బి లో సీక్రెట్ ఏజెంట్ గా చేరకముందు, దొంగతనాలు చేస్తూ నేరస్థుడిగా జీవితం గడుపుతున్నప్పటి కథల్లో ఇది ఒకటి. ఇండియన్ స్పెషల్ బ్రాంచి తనను అరెస్ట్ చేయటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించబోతున్న సమయంలో, భారతదేశాన్ని వదిలి జపాన్ దేశానికి పారిపోయాడతను. అక్కడ కుంగ్ ఫూ విద్యాపీఠంలో చేరి విద్యాభ్యాసం చేస్తున్న తరుణంలో ఫ్యుజీషాన్ అనే కుంగ్ ఫూ వస్తాదుతో తగాదా పడతాడు. తత్ఫలితంగా జపాన్ దేశంలో కూడా నిలబడటం కష్టం అవుతుంది. తనకు సంబంధించిన అనవసరమైన పనుల్లో వేళ్ళు పెట్టి, దారినపోయే కష్టాలన్నింటినీ కోరికోరి తలమీదకి తెచ్చుకోవడం బాగా అలవాటు అతనికి.
అందుకే చైనాలో ఉన్న పటోలా బౌద్ధమత పీఠానికి వచ్చిన ఒకానొక ఆపదను కడతెర్చడం కోసం ఆవైపు ప్రయాణం చేశాడు. తనకు తానుగా తలకు ఎత్తుకున్న ఆ కార్యాన్ని దిగ్విజయంగా నెరవేర్చిన తర్వాత ఒక పడవలో చైనాను వదిలి, కొరియావైపు బయలుదేరాడు. చింజు పట్టణ పరిసరాల్లో బందిపోటు దొంగల దౌష్టికానికి గురై అలమటించిపోతున్న ఆ ప్రజలను ఆదుకోవటానికి ప్రయత్నించి, అక్కడి పోలీసుల ఆగ్రహానికి గురయినాడు.
షాడో కథలను మొదటినుండి చదువుతున్న పాఠకులకు ఈ విషయాలన్నీ తెలుసు. చదవని పాఠకుల సౌలభ్యం కోసం ఈ అంశాలను ముందుగా వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఈ మాటలను వ్రాయడం జరిగింది. దొంగగా జీవిస్తున్న రోజుల్లో గమ్యంలేని జీవితాన్ని గడిపాడు షాడో. గాలి ఎటువీస్తే అటు పక్కకు తిరిగి, అడవులకు అడవుల్ని కాల్చుకుతినే కార్చిచ్చు మాదిరి తన దృష్టికి వచ్చిన అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొంటూ, ముందుకు సాగిపోవడమే ధ్యేయంగా పెట్టుకున్న మనిషి అతను. ప్రాణంలో ప్రాణమై తన స్నేహితుడు గంగారాంతో కలిసి అతను చింజు పట్టణం నుంచి పరుగు ప్రారంభించాడు. ఎటుపోవాలో, ఎక్కడికి పోవాలో తెలియదు. వెనకనుండి వచ్చి పడుతున్న కొరియన్ పోలీసుల్ని తప్పించుకోవటమే ఆ సమయంలో అతను చేయవలసిన పని. ఇక్కడి నుండి ప్రారంభమయ్యే ఈ కథ మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను.
- మధుబాబు
షాడో సి ఐ బి లో సీక్రెట్ ఏజెంట్ గా చేరకముందు, దొంగతనాలు చేస్తూ నేరస్థుడిగా జీవితం గడుపుతున్నప్పటి కథల్లో ఇది ఒకటి. ఇండియన్ స్పెషల్ బ్రాంచి తనను అరెస్ట్ చేయటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించబోతున్న సమయంలో, భారతదేశాన్ని వదిలి జపాన్ దేశానికి పారిపోయాడతను. అక్కడ కుంగ్ ఫూ విద్యాపీఠంలో చేరి విద్యాభ్యాసం చేస్తున్న తరుణంలో ఫ్యుజీషాన్ అనే కుంగ్ ఫూ వస్తాదుతో తగాదా పడతాడు. తత్ఫలితంగా జపాన్ దేశంలో కూడా నిలబడటం కష్టం అవుతుంది. తనకు సంబంధించిన అనవసరమైన పనుల్లో వేళ్ళు పెట్టి, దారినపోయే కష్టాలన్నింటినీ కోరికోరి తలమీదకి తెచ్చుకోవడం బాగా అలవాటు అతనికి. అందుకే చైనాలో ఉన్న పటోలా బౌద్ధమత పీఠానికి వచ్చిన ఒకానొక ఆపదను కడతెర్చడం కోసం ఆవైపు ప్రయాణం చేశాడు. తనకు తానుగా తలకు ఎత్తుకున్న ఆ కార్యాన్ని దిగ్విజయంగా నెరవేర్చిన తర్వాత ఒక పడవలో చైనాను వదిలి, కొరియావైపు బయలుదేరాడు. చింజు పట్టణ పరిసరాల్లో బందిపోటు దొంగల దౌష్టికానికి గురై అలమటించిపోతున్న ఆ ప్రజలను ఆదుకోవటానికి ప్రయత్నించి, అక్కడి పోలీసుల ఆగ్రహానికి గురయినాడు. షాడో కథలను మొదటినుండి చదువుతున్న పాఠకులకు ఈ విషయాలన్నీ తెలుసు. చదవని పాఠకుల సౌలభ్యం కోసం ఈ అంశాలను ముందుగా వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఈ మాటలను వ్రాయడం జరిగింది. దొంగగా జీవిస్తున్న రోజుల్లో గమ్యంలేని జీవితాన్ని గడిపాడు షాడో. గాలి ఎటువీస్తే అటు పక్కకు తిరిగి, అడవులకు అడవుల్ని కాల్చుకుతినే కార్చిచ్చు మాదిరి తన దృష్టికి వచ్చిన అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొంటూ, ముందుకు సాగిపోవడమే ధ్యేయంగా పెట్టుకున్న మనిషి అతను. ప్రాణంలో ప్రాణమై తన స్నేహితుడు గంగారాంతో కలిసి అతను చింజు పట్టణం నుంచి పరుగు ప్రారంభించాడు. ఎటుపోవాలో, ఎక్కడికి పోవాలో తెలియదు. వెనకనుండి వచ్చి పడుతున్న కొరియన్ పోలీసుల్ని తప్పించుకోవటమే ఆ సమయంలో అతను చేయవలసిన పని. ఇక్కడి నుండి ప్రారంభమయ్యే ఈ కథ మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను. - మధుబాబు© 2017,www.logili.com All Rights Reserved.