రుద్రనాగు
'వస్తున్నారు.. ప్రవాళ రాక్షసులు వచ్చేస్తున్నారు.' గొంతులు చినిగిపోయేటట్లు అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తుకు వచ్చారు ఇద్దరు యువకులు. గ్రామం మధ్యలో వున్న రచ్చబండ దగ్గర ఆటలు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు అనేకమంది. విపరీతమైన భయంతో వణికిపోతూ వారందరిని పట్టుకుని ఎవరి ఇళ్లలోకి వారు లాక్కుపోయారు తల్లులు.
రచ్చబండ మీద కూర్చుని మాటలతో కాలక్షేపం చేస్తున్న వృద్ధులు, మధ్యవయస్కులు అందరూ లేచి నిలబడి చేతులు కట్టుకుని నిలుచున్నారు.
సంతోషకరమైన వాతావరణంతో అంతకుముందు పది క్షణికాల వరకూ కళకళలాడిన ఆ ప్రదేశం కాస్తా, ఒక్కసారిగా దారుణమైన నిశ్శబ్దంతో నిండిపోయింది.
'నెలరోజుల క్రితమే కదా ఆ దుర్మార్గులు వచ్చి గ్రామాన్నంతా కలగాపులగం చేసి పోయింది. మళ్ళీ అప్పుడే రావటం ఏమిటి?' గంభీరంగా నిలబడిన గ్రామ పెద్దను అడిగాడు ఒక పౌరుడు.
'వట్టి పుణ్యానికి రారు. గాలి వార్త ఏదో చెవులపడే వుంటుంది' అన్నాడు.
రుద్రనాగు 'వస్తున్నారు.. ప్రవాళ రాక్షసులు వచ్చేస్తున్నారు.' గొంతులు చినిగిపోయేటట్లు అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తుకు వచ్చారు ఇద్దరు యువకులు. గ్రామం మధ్యలో వున్న రచ్చబండ దగ్గర ఆటలు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు అనేకమంది. విపరీతమైన భయంతో వణికిపోతూ వారందరిని పట్టుకుని ఎవరి ఇళ్లలోకి వారు లాక్కుపోయారు తల్లులు. రచ్చబండ మీద కూర్చుని మాటలతో కాలక్షేపం చేస్తున్న వృద్ధులు, మధ్యవయస్కులు అందరూ లేచి నిలబడి చేతులు కట్టుకుని నిలుచున్నారు. సంతోషకరమైన వాతావరణంతో అంతకుముందు పది క్షణికాల వరకూ కళకళలాడిన ఆ ప్రదేశం కాస్తా, ఒక్కసారిగా దారుణమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. 'నెలరోజుల క్రితమే కదా ఆ దుర్మార్గులు వచ్చి గ్రామాన్నంతా కలగాపులగం చేసి పోయింది. మళ్ళీ అప్పుడే రావటం ఏమిటి?' గంభీరంగా నిలబడిన గ్రామ పెద్దను అడిగాడు ఒక పౌరుడు. 'వట్టి పుణ్యానికి రారు. గాలి వార్త ఏదో చెవులపడే వుంటుంది' అన్నాడు.© 2017,www.logili.com All Rights Reserved.