ఒకే తల్లి కడుపునా పుట్టినా, వారిని విధి వేరుచేసి వెక్కిరించింది. చెల్లెలు కలవారి ఇంట కనకపీఠం ఎక్కింది. అక్క అనాధగా మారి ఆ ఇంటికే చేరింది. వారికి తమ అనుబంధాలు మాత్రం తెలియవు. అక్కకు జీవితం ఒర్పునీ, ఒదార్పునీ, త్యాగాన్నీ నేర్పగా చెల్లెలికి ధనలాలసత్వం కన్నుగప్పింది. ఫలితంగా ఆమె దారి తప్పింది. పెళ్ళి కాకుండా చెల్లెలు ప్రసవించిన శిశువును అక్క అక్కున చేర్చుకుని, నింద తనమీద వేసుకుంది.
జీవితానందాన్ని తన సర్వస్వాన్ని ఆమెకే దారబోసింది. తన ప్రియుడు చెల్లెలి భర్త అయినప్పుడు - తనని లోకం నిందల ఉక్కుగోళ్ళతో రక్కుతున్నప్పుడు, ఆ త్యాగమయి అన్నిటికీ భరించింది. వెక్కిరించిన ఆ విధే కడకు ఆమెకు ఆనందాన్ని దక్కించింది. ఏమిటా ఆనందం? ఏమిటా త్యాగం? ఆమె జీవిత గమనం ముళ్ళదారులు గడిచి, ఆనందపు పూల లోకం జేరిన అంతరాలు ఈ సంధ్య మీకు చెపుతుంది దయచేసి వినండి.
ఒకే తల్లి కడుపునా పుట్టినా, వారిని విధి వేరుచేసి వెక్కిరించింది. చెల్లెలు కలవారి ఇంట కనకపీఠం ఎక్కింది. అక్క అనాధగా మారి ఆ ఇంటికే చేరింది. వారికి తమ అనుబంధాలు మాత్రం తెలియవు. అక్కకు జీవితం ఒర్పునీ, ఒదార్పునీ, త్యాగాన్నీ నేర్పగా చెల్లెలికి ధనలాలసత్వం కన్నుగప్పింది. ఫలితంగా ఆమె దారి తప్పింది. పెళ్ళి కాకుండా చెల్లెలు ప్రసవించిన శిశువును అక్క అక్కున చేర్చుకుని, నింద తనమీద వేసుకుంది. జీవితానందాన్ని తన సర్వస్వాన్ని ఆమెకే దారబోసింది. తన ప్రియుడు చెల్లెలి భర్త అయినప్పుడు - తనని లోకం నిందల ఉక్కుగోళ్ళతో రక్కుతున్నప్పుడు, ఆ త్యాగమయి అన్నిటికీ భరించింది. వెక్కిరించిన ఆ విధే కడకు ఆమెకు ఆనందాన్ని దక్కించింది. ఏమిటా ఆనందం? ఏమిటా త్యాగం? ఆమె జీవిత గమనం ముళ్ళదారులు గడిచి, ఆనందపు పూల లోకం జేరిన అంతరాలు ఈ సంధ్య మీకు చెపుతుంది దయచేసి వినండి.© 2017,www.logili.com All Rights Reserved.