శనివారం నాది
Our greatest joy and our greatest pain come in our relationships with others.
---Stephen R. Covey
"మొదలైందా?” అతను అడిగాడు.
ఆ గదిలోకి వచ్చిన మంత్రసాని తలూపి అడిగింది.
"నిజంగా మీరు చూడాలనుకుంటున్నారా?”
"ఇంతదాకా వచ్చాక ఆ అనుమానం దేనికి?" నవ్వాడు.
"చూడటానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది.”
"భయంకరంగా కూడా ఉంటుందా?" ఆశగా అడిగాడు.
"నిజానికి ఓసారి చూస్తే మీరెప్పుడూ ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళలేరు.”
“ఫర్వాలేదు. పద.”
అతను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, చిన్నగా మూలుగు వినిపిస్తున్న పక్క గదిలోకి వెళ్ళాడు. వెనకే మంత్రసాని వెళ్ళింది.
అదో చిన్న గది. గదిలో మంచం మీద ఓ ముప్ఫై ఆరేళ్ళ యువతి వెల్లకిలా వేడుకుని ఉంది. కళ్ళుమూసుకుని మూలుగుతోంది. ఆమె మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఓ బల్ల మీద కిరసనాయిలు స్టవ్ మీద గిన్నెలో మరుగుతున్న నీళ్ళు. ఆ నీళ్ళలో స్టెరిలైజ్ అవుతున్న రెండు కత్తెరలు, స్టవ్ పక్కనే హాస్పిటల్లో ఉపయోగించే దూది, పాతగుడ్డలు. నిశ్శబ్దంగా మంచం పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు................
శనివారం నాది Our greatest joy and our greatest pain come in our relationships with others.---Stephen R. Covey "మొదలైందా?” అతను అడిగాడు.ఆ గదిలోకి వచ్చిన మంత్రసాని తలూపి అడిగింది."నిజంగా మీరు చూడాలనుకుంటున్నారా?” "ఇంతదాకా వచ్చాక ఆ అనుమానం దేనికి?" నవ్వాడు."చూడటానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది.”"భయంకరంగా కూడా ఉంటుందా?" ఆశగా అడిగాడు. "నిజానికి ఓసారి చూస్తే మీరెప్పుడూ ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళలేరు.” “ఫర్వాలేదు. పద.” అతను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, చిన్నగా మూలుగు వినిపిస్తున్న పక్క గదిలోకి వెళ్ళాడు. వెనకే మంత్రసాని వెళ్ళింది. అదో చిన్న గది. గదిలో మంచం మీద ఓ ముప్ఫై ఆరేళ్ళ యువతి వెల్లకిలా వేడుకుని ఉంది. కళ్ళుమూసుకుని మూలుగుతోంది. ఆమె మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఓ బల్ల మీద కిరసనాయిలు స్టవ్ మీద గిన్నెలో మరుగుతున్న నీళ్ళు. ఆ నీళ్ళలో స్టెరిలైజ్ అవుతున్న రెండు కత్తెరలు, స్టవ్ పక్కనే హాస్పిటల్లో ఉపయోగించే దూది, పాతగుడ్డలు. నిశ్శబ్దంగా మంచం పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు................© 2017,www.logili.com All Rights Reserved.