రచనలన్నీ కూడా సామాన్యుల పక్షాన నిలబడి పాఠకులను ఆలోచింపజేస్తాయి. ప్రజాహితాన్ని కోరుకుంటూనే కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయి. ఈ పనిని అవి ఎంతో సున్నితంగా మనుషుల పట్ల ప్రేమతో సంఘం పట్ల నిష్ఠతో పర్యవర్ణం పట్ల శ్రద్ధతో చేస్తాయి. ప్రతి రచనలోనూ కనీసం ఒకటో రెండో గుర్తుంచుకోవలసిన వాక్యాలు ఆగి ఆలోచించాల్సిన సందర్భాలు కనిపిస్తాయి. మరోవైపు ప్రజాకంటకుల్ని దుర్మార్గుల్ని అవినీతిపరుల్ని అవకాశం దొరికినప్పుడల్లా నిర్దాక్షిణ్యంగా మాటలు కొరడాతో చావగొడతాయి. అలాగని ఈ రచనల్లో ఎక్కడ సైద్ధాంతిక చర్చలు లేవు. వ్యంగ్యం మితిమీరలేదు. హాస్యం వికటించలేదు. చురకలే గని వటల్లేవు. ఈ రచనలన్నీ కూడా ఓకే చిరకాల మిత్రురాలు తమతో ప్రత్యక్షంగా సంభాషిస్తున్న అనుభూతిని పాఠకులకు కల్గిస్తాయి. ఇక్కడున్నవన్నీ ఏకపక్ష తీర్మానాలకు అంతిమ పరిష్కారాలకు దూరంగా నడయాడే ప్రజాస్వామిక ప్రతిపాదనలు.
- వేమన వసంతలక్ష్మి