అసలే ఆదివారం అమావాస్య. ఆ పైన అష్టమి తిధి కూడా కలిసిన సాయంకాల సమయం. తను బయలుదేరిన ముహూర్తం మంచిదో, కాదోనని తీవ్రంగా ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడా యువకుడు. ఆ రోజు తారాపూర్ లో పెద్ద సంత జరుగుతోంది. సంత రోజున ఆ ఏరియాలో దొరకని వస్తువంటూ ఉండదని ఆ చుట్టుపక్కల అందరూ చెప్పుకుంటారు. సంత జరుగుతున్న ప్రదేశం నుంచి రణగొణధ్వనితో కూడిన సంత గోల చెవులు గింగిర్లు ఎత్తేలా వినవస్తోంది. తనకు కావలసిన మనిషి కోసం ఎదురుపడుతున్న ప్రతి మనిషినీ పరికిస్తూ ముందుకు నెమ్మదిగా కదులుతున్నాడా యువకుడు. మాసిన పైజామా జుబ్బా, చేతిలో గుద్దల సంచి, భుజాన తుండుగుడ్డ, పాదాలకు అరిగిపోయిన హవాయి, చెప్పులతో చూడ్డానికి ఎవడో దిక్కు మొక్కులేని పల్లెటూరి బైతులా ఉన్నాడా యువకుడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
అసలే ఆదివారం అమావాస్య. ఆ పైన అష్టమి తిధి కూడా కలిసిన సాయంకాల సమయం. తను బయలుదేరిన ముహూర్తం మంచిదో, కాదోనని తీవ్రంగా ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడా యువకుడు. ఆ రోజు తారాపూర్ లో పెద్ద సంత జరుగుతోంది. సంత రోజున ఆ ఏరియాలో దొరకని వస్తువంటూ ఉండదని ఆ చుట్టుపక్కల అందరూ చెప్పుకుంటారు. సంత జరుగుతున్న ప్రదేశం నుంచి రణగొణధ్వనితో కూడిన సంత గోల చెవులు గింగిర్లు ఎత్తేలా వినవస్తోంది. తనకు కావలసిన మనిషి కోసం ఎదురుపడుతున్న ప్రతి మనిషినీ పరికిస్తూ ముందుకు నెమ్మదిగా కదులుతున్నాడా యువకుడు. మాసిన పైజామా జుబ్బా, చేతిలో గుద్దల సంచి, భుజాన తుండుగుడ్డ, పాదాలకు అరిగిపోయిన హవాయి, చెప్పులతో చూడ్డానికి ఎవడో దిక్కు మొక్కులేని పల్లెటూరి బైతులా ఉన్నాడా యువకుడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.