సహచరులారా, మీరు ఆస్వాదించిన యవ్వనారంభకాలం, గడిచిపోయినందుకు చింతిస్తున్నారా, కానీ నాకు అది తన జైలు ఊచల్నీ, సంకెళ్లను తలచుకుంటున్న ఖైదీకి వలె జ్ఞాపకం ఉంది. మీరు శైశవానికి యవ్వనానికి నడుమ కాలాన్ని నిర్బంధాలకూ, పట్టింపులకూ అతీతమైన స్వర్ణయుగపు వాకిలిగా భావించవచ్చు, కానీ నేను నా హృదయంలో మొలకెత్తి ఎదిగిన ప్రేమవిత్తనానికి; అప్పటికి అందని ఎరుకవల్ల, ప్రేమ నా గుండెతలుపులను తెరిచి, అన్ని గదుల్నీ వెలుగులతో నింపేవరకూ ఆ దారిదొరకని కాలాన్ని నా మౌనవిషాదయుగమనే తలుస్తాను. ప్రేమ నాకు అస్వాదననూ, వేదననూ అందించింది. జనులారా! మీరు ఆటలాడిన తోటలలో విరిసినపూలనూ, కలిసిన ప్రదేశాలనూ, మీ గుసగుసలన్నింటినీ విన్న వీధిమూలలనూ మాత్రమే గుర్తుంచుకుంటారు. అలాగే నాకూ ఉత్తర లెబనాన్లోని ఆ అందమైనలోగిలి ఇంకా గుర్తుంది. నేను నా కనులు మూసుకున్న ప్రతిసారీ, సమ్మోహనలోయలను, ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న గొప్పతనంతో, స్వాతిశయంతో | నిండిన అక్కడి పర్వతశిఖరాగ్రాలను చూస్తున్నాను. నగరఘోషకు నేను చెవులుమూసుకున్న ప్రతిసారీ నేను ఆ వాగుల గలగలల్నీ, కొమ్మల రెపరెపల గుసగుసల్నీ వింటున్నాను. పసిపిల్లవాడు తనతల్లి రొమ్ముకోసం తహతహలాడుతున్నట్టు, నేనిప్పుడు మాట్లాడుతున్న. నేను దర్శించాలని..................
నా మౌనవిషాదం సహచరులారా, మీరు ఆస్వాదించిన యవ్వనారంభకాలం, గడిచిపోయినందుకు చింతిస్తున్నారా, కానీ నాకు అది తన జైలు ఊచల్నీ, సంకెళ్లను తలచుకుంటున్న ఖైదీకి వలె జ్ఞాపకం ఉంది. మీరు శైశవానికి యవ్వనానికి నడుమ కాలాన్ని నిర్బంధాలకూ, పట్టింపులకూ అతీతమైన స్వర్ణయుగపు వాకిలిగా భావించవచ్చు, కానీ నేను నా హృదయంలో మొలకెత్తి ఎదిగిన ప్రేమవిత్తనానికి; అప్పటికి అందని ఎరుకవల్ల, ప్రేమ నా గుండెతలుపులను తెరిచి, అన్ని గదుల్నీ వెలుగులతో నింపేవరకూ ఆ దారిదొరకని కాలాన్ని నా మౌనవిషాదయుగమనే తలుస్తాను. ప్రేమ నాకు అస్వాదననూ, వేదననూ అందించింది. జనులారా! మీరు ఆటలాడిన తోటలలో విరిసినపూలనూ, కలిసిన ప్రదేశాలనూ, మీ గుసగుసలన్నింటినీ విన్న వీధిమూలలనూ మాత్రమే గుర్తుంచుకుంటారు. అలాగే నాకూ ఉత్తర లెబనాన్లోని ఆ అందమైనలోగిలి ఇంకా గుర్తుంది. నేను నా కనులు మూసుకున్న ప్రతిసారీ, సమ్మోహనలోయలను, ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న గొప్పతనంతో, స్వాతిశయంతో | నిండిన అక్కడి పర్వతశిఖరాగ్రాలను చూస్తున్నాను. నగరఘోషకు నేను చెవులుమూసుకున్న ప్రతిసారీ నేను ఆ వాగుల గలగలల్నీ, కొమ్మల రెపరెపల గుసగుసల్నీ వింటున్నాను. పసిపిల్లవాడు తనతల్లి రొమ్ముకోసం తహతహలాడుతున్నట్టు, నేనిప్పుడు మాట్లాడుతున్న. నేను దర్శించాలని..................© 2017,www.logili.com All Rights Reserved.