భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచం లోకి...!
ఝాన్సీ కొప్పిశెట్టి రెండవ కలల పంట విరోధాభాస. మొదటి నవల అనాచ్చాదిత కథ. మొదటి నవల పుట్టుకకు రమారమి పదేళ్లు పడితే ఈ రెండవ నవల అత్యంత శీఘ్రంగా పాఠకులను అలరించడానికి వచ్చేసింది. ఝాన్సీ కొప్పిశెట్టి రచనలు అన్నీ స్త్రీ కేంద్రకం గానే ఉంటాయి. అలాగని సిద్ధాంత రాద్ధాంతాల జోలికి వెళ్లవు. ఉన్న జీవితాన్ని నిరలంకారంగా యథాతథంగా బొమ్మ కట్టి చూపుతాయి. కార్యాకారణ సంబంధాల విశ్లేషణకు కానీ, గతి తార్కిక, అద్వైత, ఆధ్యాత్మిక భావ సంచయాలు వైపు కానీ వెళ్లవు. మానవ జీవితం ఏ అంచనాలకీ అందకుండా ఎలాగైతే స్వయం జ్వలితంగా ఉంటుందో, ఝాన్సీ కొప్పిశెట్టి పాత్రలన్నీ స్వయం జ్వలితంగా ఉంటాయి. పాత్రలేవీ రచయిత అవడానికి అవి రచయిత సృష్టించిన పాత్రలే అయినప్పటికీ నియంత్రణలో వుండవు. నవలలో ఇదొక సుగుణం. చాలామంది నవల రాసేటప్పుడు. ఒక కథ అనుకుని, స్క్రీన్ ప్లే రాసుకుని నవల రాస్తారు. ఒకసారి పాత్రలను సృష్టించాక. వాటి స్వరూప స్వభావాలను నిర్ణయించేశాక, రచయిత ఆ పాత్రల మానాన వాటిని వదిలివేయాలి. అప్పుడు, అవి తమ జీవితం తాము జీవిస్తూ రచయితకు కొంచెం కొంచెంగా అవసరమైన మేరకు ఒక స్పేస్ ఇస్తాయి. ఆ స్పేస్ లో రచయిత పాత్రలకు మార్గ నిర్దేశకత్వం చేయాలి. కేవలం మార్గాన్ని నిర్దేశించడం వరకే రచయిత పని ప్రయాణంలో గమ్యానికి చేయవలసిన ప్రయాణం అంతా పాత్రలే చేయాలి. ఆ ఎదురయ్యే కష్ట నష్టాలను పాత్రలే భరించాలి............
భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచం లోకి...! ఝాన్సీ కొప్పిశెట్టి రెండవ కలల పంట విరోధాభాస. మొదటి నవల అనాచ్చాదిత కథ. మొదటి నవల పుట్టుకకు రమారమి పదేళ్లు పడితే ఈ రెండవ నవల అత్యంత శీఘ్రంగా పాఠకులను అలరించడానికి వచ్చేసింది. ఝాన్సీ కొప్పిశెట్టి రచనలు అన్నీ స్త్రీ కేంద్రకం గానే ఉంటాయి. అలాగని సిద్ధాంత రాద్ధాంతాల జోలికి వెళ్లవు. ఉన్న జీవితాన్ని నిరలంకారంగా యథాతథంగా బొమ్మ కట్టి చూపుతాయి. కార్యాకారణ సంబంధాల విశ్లేషణకు కానీ, గతి తార్కిక, అద్వైత, ఆధ్యాత్మిక భావ సంచయాలు వైపు కానీ వెళ్లవు. మానవ జీవితం ఏ అంచనాలకీ అందకుండా ఎలాగైతే స్వయం జ్వలితంగా ఉంటుందో, ఝాన్సీ కొప్పిశెట్టి పాత్రలన్నీ స్వయం జ్వలితంగా ఉంటాయి. పాత్రలేవీ రచయిత అవడానికి అవి రచయిత సృష్టించిన పాత్రలే అయినప్పటికీ నియంత్రణలో వుండవు. నవలలో ఇదొక సుగుణం. చాలామంది నవల రాసేటప్పుడు. ఒక కథ అనుకుని, స్క్రీన్ ప్లే రాసుకుని నవల రాస్తారు. ఒకసారి పాత్రలను సృష్టించాక. వాటి స్వరూప స్వభావాలను నిర్ణయించేశాక, రచయిత ఆ పాత్రల మానాన వాటిని వదిలివేయాలి. అప్పుడు, అవి తమ జీవితం తాము జీవిస్తూ రచయితకు కొంచెం కొంచెంగా అవసరమైన మేరకు ఒక స్పేస్ ఇస్తాయి. ఆ స్పేస్ లో రచయిత పాత్రలకు మార్గ నిర్దేశకత్వం చేయాలి. కేవలం మార్గాన్ని నిర్దేశించడం వరకే రచయిత పని ప్రయాణంలో గమ్యానికి చేయవలసిన ప్రయాణం అంతా పాత్రలే చేయాలి. ఆ ఎదురయ్యే కష్ట నష్టాలను పాత్రలే భరించాలి............© 2017,www.logili.com All Rights Reserved.