గౌతమ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఆమధ్యన ఒక శతావధాని “నేను చేసిన ప్రతి అవధానం ఒక పద్యకావ్యం ' అన్నాడు. ఆహా !.... అనుకొన్నా. ఆ దినుసు ఆత్మవిశ్వాసం తలకెక్కని అవధానులూ కొందరున్నారు. వాళ్లు కావ్యాలు రచిస్తున్నారు. అందరూ సమస్కంధులు. వారిలో ఒకరు గురుసహస్రావధాని డా.కడిమిళ్ళ వరప్రసాద్ గారు. అందుకని ముందుగా అభినందిస్తున్నాను. వీరి ఇటీవలి పద్యకావం ఈ '
గోభాగవతం'. ఇది 2018-2020 నడిమి రచన. మనదేశంలో గోమాతకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్లున్నాయి. ఇటీవలనే సర్వోచ్చ న్యాయస్థానం గోవధ నిషేధానికి అనుకూలంగా మాట్లాడిందంటున్నారు. సాధారణ ప్రజలలో గోసేవపట్ల ఆదరం పెరిగినట్టే కనబడుతోంది. ఇదే తరుణంలో ఈ కావ్యం వెలువడటం అదొక 'వరప్రసాదం'.
ఇది గోమాహాత్మ్యం కనుక కర్తనూ భర్తనూ తరింపజేస్తుంది. అలాగే తొలిశ్రోత్రి బాలమ్మనూ శ్రావయితనూ (కవిగారే. ద్వితీయ తృతీయస్కంధాలలో వసిష్ఠుడులాగ) తరింపజేస్తుంది. రేపటి నుంచి ప్రతీపాఠకుణ్ని, ప్రతీ శ్రోతనూ తరింపజేస్తుంది. ఇలా ఇది సర్వదా ఉభయతారకం. గోపభాగవతమంత పవిత్రమైనది గోభాగవతం.
కావ్యానికి పీఠిక వ్రాయడం కాసింత కష్టమే. పంచభక్ష్య పరమాన్నాలు వడ్డిస్తే ఎంపిక కష్టమే. ఒకటి రెండు శాకపాకాలు కలగలపడమూ, కొన్నింటిని వాచవిగా స్పృశించి వదలడమూ అనివార్యం.
ఈ కావ్యంలో కథనం పౌరాణికశైలి. గ్రథనం ప్రాబంధిక శైలి. కవనంలో శబ్దార్థప్రొథి పాత్రోన్మీలనంలో లోకజ్ఞతా నిరూఢి. ఏవంవిధ కవితాగుణభద్ర, ఈ కావ్యం ఒక చిన్ముద్ర.
చెల్లెలు అడిగితే అన్నగారు చెప్పడం దీని కథ. ఒకరిది పరీక్షిద్భూమిక.. ప్రథమస్కంధం గోమహిమ. చ్యవనమహర్షి కథ. ద్వితీయ స్కంధం దిలీపుడి కథ.
గోసేవామహిమ. తృతీయ స్కంధం వసిష్ఠ విశ్వామిత్రుల కథ. గోశక్తి. చతుర్దస్కంధం గౌతమర్షి కథ. గోదావరి అవతరణ.
గోపవిత్రత.
గౌతమ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఆమధ్యన ఒక శతావధాని “నేను చేసిన ప్రతి అవధానం ఒక పద్యకావ్యం ' అన్నాడు. ఆహా !.... అనుకొన్నా. ఆ దినుసు ఆత్మవిశ్వాసం తలకెక్కని అవధానులూ కొందరున్నారు. వాళ్లు కావ్యాలు రచిస్తున్నారు. అందరూ సమస్కంధులు. వారిలో ఒకరు గురుసహస్రావధాని డా.కడిమిళ్ళ వరప్రసాద్ గారు. అందుకని ముందుగా అభినందిస్తున్నాను. వీరి ఇటీవలి పద్యకావం ఈ ' గోభాగవతం'. ఇది 2018-2020 నడిమి రచన. మనదేశంలో గోమాతకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్లున్నాయి. ఇటీవలనే సర్వోచ్చ న్యాయస్థానం గోవధ నిషేధానికి అనుకూలంగా మాట్లాడిందంటున్నారు. సాధారణ ప్రజలలో గోసేవపట్ల ఆదరం పెరిగినట్టే కనబడుతోంది. ఇదే తరుణంలో ఈ కావ్యం వెలువడటం అదొక 'వరప్రసాదం'. ఇది గోమాహాత్మ్యం కనుక కర్తనూ భర్తనూ తరింపజేస్తుంది. అలాగే తొలిశ్రోత్రి బాలమ్మనూ శ్రావయితనూ (కవిగారే. ద్వితీయ తృతీయస్కంధాలలో వసిష్ఠుడులాగ) తరింపజేస్తుంది. రేపటి నుంచి ప్రతీపాఠకుణ్ని, ప్రతీ శ్రోతనూ తరింపజేస్తుంది. ఇలా ఇది సర్వదా ఉభయతారకం. గోపభాగవతమంత పవిత్రమైనది గోభాగవతం. కావ్యానికి పీఠిక వ్రాయడం కాసింత కష్టమే. పంచభక్ష్య పరమాన్నాలు వడ్డిస్తే ఎంపిక కష్టమే. ఒకటి రెండు శాకపాకాలు కలగలపడమూ, కొన్నింటిని వాచవిగా స్పృశించి వదలడమూ అనివార్యం. ఈ కావ్యంలో కథనం పౌరాణికశైలి. గ్రథనం ప్రాబంధిక శైలి. కవనంలో శబ్దార్థప్రొథి పాత్రోన్మీలనంలో లోకజ్ఞతా నిరూఢి. ఏవంవిధ కవితాగుణభద్ర, ఈ కావ్యం ఒక చిన్ముద్ర. చెల్లెలు అడిగితే అన్నగారు చెప్పడం దీని కథ. ఒకరిది పరీక్షిద్భూమిక.. ప్రథమస్కంధం గోమహిమ. చ్యవనమహర్షి కథ. ద్వితీయ స్కంధం దిలీపుడి కథ. గోసేవామహిమ. తృతీయ స్కంధం వసిష్ఠ విశ్వామిత్రుల కథ. గోశక్తి. చతుర్దస్కంధం గౌతమర్షి కథ. గోదావరి అవతరణ. గోపవిత్రత.© 2017,www.logili.com All Rights Reserved.