ఆరాధన - రెండవ కావ్యం 2010 సం||ములో అచ్చయింది. ఇప్పుడు మూడవ కావ్యం 'నేనొక పూలరెమ్మనై' మీ ముందుకు వచ్చింది. అంటే దాదాపు దశాబ్దకాలం తర్వాత ఇంకొక కావ్యం . ఈ పదేళ్ల కాలంలో నేనేమి చేసినట్లు. ఒక్క పద్యం కూడ వ్రాయలేదా అంటే దాదాపు 2400 పద్యాలు (కొన్ని ఖండికలలో) వ్రాసాను. పద్యం నా శ్వాస, పద్యం నా ధ్యాస. కానీ అవేవీ అచ్చుకు నోచుకోలేదు.
ఆ మధ్యకాలంలో ప్రముఖ పండితులు శ్రీ ఇప్పగుంట సాయిబాబాగారి పరిచయం ఏర్పడింది. ఆయన ప్రభావం నన్ను సంప్రదాయ సాహిత్యాన్ని ఇష్టంగా చదివించింది. నిశితంగా విమర్శింపజేసింది. ఈ క్రమంలో మిత్రులు శ్రీ రావి మోహనరావు (చీరాల)గారు నా చేత బహుళాశ్వచరిత్రము (దామెర్ల వేంగళభూపాలుడు), శివలీలావిలాసము (కూచిమంచి తిమ్మకవి), వల్లవీ పల్లవోల్లాసము (మాడభూషి నరసింహాచార్యులు), మృత్యుంజయ శతకము (మాధవ పెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి), సస్యానందము (దోనయామాత్యుడు) మొదలైన ప్రాచీన కావ్యాలను పరిష్కరింపజేసి, విపులమైన పీఠికలు వ్రాయించారు. శ్రీ దాసు అచ్యుతరావుగారు కూడ తన పూర్వికురాలైన వేమూరి (దాసు) శారదాంబగారి నాగ్నజితీపరిణయము, మాధవశతకాలను పరిష్కరింపజేసి నాచేత పీఠికలు వ్రాయించారు. ఈ విధంగా గ్రంథ పరిష్కరణలు, పీఠికలతోమునకలవుతున్నప్పుడు 23. 3.2015 నాడు చిట్టివలస (విశాఖపట్టణం)నుంచి నాకొక ఉత్తరం వచింది. అందులో -
ఆరాధన - రెండవ కావ్యం 2010 సం||ములో అచ్చయింది. ఇప్పుడు మూడవ కావ్యం 'నేనొక పూలరెమ్మనై' మీ ముందుకు వచ్చింది. అంటే దాదాపు దశాబ్దకాలం తర్వాత ఇంకొక కావ్యం . ఈ పదేళ్ల కాలంలో నేనేమి చేసినట్లు. ఒక్క పద్యం కూడ వ్రాయలేదా అంటే దాదాపు 2400 పద్యాలు (కొన్ని ఖండికలలో) వ్రాసాను. పద్యం నా శ్వాస, పద్యం నా ధ్యాస. కానీ అవేవీ అచ్చుకు నోచుకోలేదు. ఆ మధ్యకాలంలో ప్రముఖ పండితులు శ్రీ ఇప్పగుంట సాయిబాబాగారి పరిచయం ఏర్పడింది. ఆయన ప్రభావం నన్ను సంప్రదాయ సాహిత్యాన్ని ఇష్టంగా చదివించింది. నిశితంగా విమర్శింపజేసింది. ఈ క్రమంలో మిత్రులు శ్రీ రావి మోహనరావు (చీరాల)గారు నా చేత బహుళాశ్వచరిత్రము (దామెర్ల వేంగళభూపాలుడు), శివలీలావిలాసము (కూచిమంచి తిమ్మకవి), వల్లవీ పల్లవోల్లాసము (మాడభూషి నరసింహాచార్యులు), మృత్యుంజయ శతకము (మాధవ పెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి), సస్యానందము (దోనయామాత్యుడు) మొదలైన ప్రాచీన కావ్యాలను పరిష్కరింపజేసి, విపులమైన పీఠికలు వ్రాయించారు. శ్రీ దాసు అచ్యుతరావుగారు కూడ తన పూర్వికురాలైన వేమూరి (దాసు) శారదాంబగారి నాగ్నజితీపరిణయము, మాధవశతకాలను పరిష్కరింపజేసి నాచేత పీఠికలు వ్రాయించారు. ఈ విధంగా గ్రంథ పరిష్కరణలు, పీఠికలతోమునకలవుతున్నప్పుడు 23. 3.2015 నాడు చిట్టివలస (విశాఖపట్టణం)నుంచి నాకొక ఉత్తరం వచింది. అందులో -© 2017,www.logili.com All Rights Reserved.