గురజాడ శతవర్థంతికి నివాళిగా శతాధిక కవుల కవితాహారం సమర్పించాలన్న సంకల్పం శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ డి. కథానిక జీవిగా, కథానికా సారథిగా వేదగిరి రాంబాబు గురజాడ జ్ఞాపకాల బాటలో వెలుగుపూలు పరుస్తున్నాడు. నూట యాభైఏడు మంది కవుల కవితలతో ఈ 'అక్షర' రూపొందింది. దీనిని సంకల్పించే పనిలో అడిగిన వెంటనే తమ కవితలను అందించిన, చనువు తీసుకోనిచ్చి సహకరించిన కవి ప్రముఖులకు, కవిమిత్రులకు ఎంతో కృతజ్ఞతలు.
ప్రకటనకు స్పందించి అందిన వాటిల్లోంచి కొందరు కొత్తవారిని చేర్చం. ఇది సమగ్రంగా కవులందరి ప్రాతినిధ్యంలో వుందని అనడం లేదు. ఇందులో చేరదగిన, చేర్చదగిన వారింకా ఉంటారని తెలుసు. కానీ ఉన్నంతలో ఈ కవితాహారాన్ని వైవిధ్యభారితంగానూ, రసమంచితంగానూ సంతరించి గురజాడ శతవర్థంతి నివాళిగా సమర్పిస్తున్నాం. ఈ సంకలనం సందోర్భోచితమనీ, చిరస్మరణికమనీ భావిస్తున్నాం. కవితాభిరుచిగల పాఠకలోకం దీనిని సమాధరించగలదని ఆకాంక్ష. ఒక చారిత్రిక సందర్భానికి చేసిన ఈ ప్రయత్నం నచ్చుతుందని విశ్వాసం.
- సుధామ
మెచ్చనంటా వీవు, నీవిక
మెచ్చుకుంటే మించిపాయెను
కొయ్యబొమ్మలే మెచ్చు కళ్ళకు
కోమలుల సౌరెక్కునా
బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు
బ్రీతి గూర్చేనో, వాడే ధన్యుడు..
- గురజాడ
గురజాడ శతవర్థంతికి నివాళిగా శతాధిక కవుల కవితాహారం సమర్పించాలన్న సంకల్పం శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ డి. కథానిక జీవిగా, కథానికా సారథిగా వేదగిరి రాంబాబు గురజాడ జ్ఞాపకాల బాటలో వెలుగుపూలు పరుస్తున్నాడు. నూట యాభైఏడు మంది కవుల కవితలతో ఈ 'అక్షర' రూపొందింది. దీనిని సంకల్పించే పనిలో అడిగిన వెంటనే తమ కవితలను అందించిన, చనువు తీసుకోనిచ్చి సహకరించిన కవి ప్రముఖులకు, కవిమిత్రులకు ఎంతో కృతజ్ఞతలు. ప్రకటనకు స్పందించి అందిన వాటిల్లోంచి కొందరు కొత్తవారిని చేర్చం. ఇది సమగ్రంగా కవులందరి ప్రాతినిధ్యంలో వుందని అనడం లేదు. ఇందులో చేరదగిన, చేర్చదగిన వారింకా ఉంటారని తెలుసు. కానీ ఉన్నంతలో ఈ కవితాహారాన్ని వైవిధ్యభారితంగానూ, రసమంచితంగానూ సంతరించి గురజాడ శతవర్థంతి నివాళిగా సమర్పిస్తున్నాం. ఈ సంకలనం సందోర్భోచితమనీ, చిరస్మరణికమనీ భావిస్తున్నాం. కవితాభిరుచిగల పాఠకలోకం దీనిని సమాధరించగలదని ఆకాంక్ష. ఒక చారిత్రిక సందర్భానికి చేసిన ఈ ప్రయత్నం నచ్చుతుందని విశ్వాసం. - సుధామ మెచ్చనంటా వీవు, నీవిక మెచ్చుకుంటే మించిపాయెను కొయ్యబొమ్మలే మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు బ్రీతి గూర్చేనో, వాడే ధన్యుడు.. - గురజాడ© 2017,www.logili.com All Rights Reserved.