నీ వెలుగులో స్నానించి, నిన్నే ధ్యానించి
నీ తెజస్సునే శ్వాసించి, ఉపాసించి
నీలో నను దర్శిస్తున్నాను
నీవదృశ్యపవనమై నన్నావహిస్తే -
జవజవలాడుతూ కువకువలాడుతూ
రేణువై తన్మయత్వంలో తేలియాడుతూ
వ్రేళ్లల్లోంచి జీవధారగా జాలువారుతూ
నీతో నను ఆవిష్కరిస్తున్నా -
గగనదిశగా ఎగిరే పిట్టలుగా ప్రదర్శిస్తున్నా -
అవనిపై పలచటి పచ్చటి ఆహార్యమై ఆవరిస్తున్నా
హృదిహృదికి పూవులా సేతువు నీవు
నీ పరిమళ ప్రవాహరాగాలే
మా సృజన, శాస్త్రం, కళలు, తత్త్వం
స్థితి - గతి - ప్రగతి - పురోగతి
ఆలింగాన ఆశ్రయాలతో జీవనశిల్పమైన బతుకుశిల
భావుకతకు బావుటావై -
మనుగడకు మకుటమైన - అక్షరమా!
నేనేమైతే నీ ఋణం తీరుతుంది?
నా జీవం నీ ప్రాణంలో మమేకమవుతుంది?
నీ వెలుగులో స్నానించి, నిన్నే ధ్యానించి నీ తెజస్సునే శ్వాసించి, ఉపాసించి నీలో నను దర్శిస్తున్నాను నీవదృశ్యపవనమై నన్నావహిస్తే - జవజవలాడుతూ కువకువలాడుతూ రేణువై తన్మయత్వంలో తేలియాడుతూ వ్రేళ్లల్లోంచి జీవధారగా జాలువారుతూ నీతో నను ఆవిష్కరిస్తున్నా - గగనదిశగా ఎగిరే పిట్టలుగా ప్రదర్శిస్తున్నా - అవనిపై పలచటి పచ్చటి ఆహార్యమై ఆవరిస్తున్నా హృదిహృదికి పూవులా సేతువు నీవు నీ పరిమళ ప్రవాహరాగాలే మా సృజన, శాస్త్రం, కళలు, తత్త్వం స్థితి - గతి - ప్రగతి - పురోగతి ఆలింగాన ఆశ్రయాలతో జీవనశిల్పమైన బతుకుశిల భావుకతకు బావుటావై - మనుగడకు మకుటమైన - అక్షరమా! నేనేమైతే నీ ఋణం తీరుతుంది? నా జీవం నీ ప్రాణంలో మమేకమవుతుంది?© 2017,www.logili.com All Rights Reserved.