కొన్ని జ్ఞాపకాలను వర్తమాన అనుభవ స్థితికి ముడివేసుకుని అన్వేషించడం స్వేచ్చ కవితల్లో కనిపించే ఒక లక్షణం. దుఃఖపు దుప్పటి, రక్తపు ముసురు, కన్నీటిపూలు, గాలిపూల తోటలు, పసితనపు సంద్రం, గాయపు రంగులు, నల్లటిగాలి జలపాతపు గొంతు, రంగులేని రక్తపు జలపాతాలు, గాలి ఆకుల ఎదురు చూపులు, కుళ్ళిన రెప్పల శవాలు, గాలి గాయాలు, ఉద్వేగపడుతున్న కంటి అల, రాతిముడి, ముడతపడిన మబ్బుల ననల, రంగుల సముద్రం లాంటి అభివ్యక్తితో స్వేచ్చ కవిత్వం మనలను ఆకర్షిస్తుంది. నూతన వ్యక్తీకరణ తన సంవేదనల తీవ్రతవల్లనే ఏ కవికైనా సాధ్యమవుతుంది. స్వేచ్చ కవిత్వం ఉద్వేగ ప్రధానం. సంవేదనలు ప్రచండం. కాబట్టే చప్పున మనసుకు పడతాయి. ఎక్కువ సందర్భాల్లో స్వేచ్చ కవిత్వంలో వ్యక్తం చేసిన అనుభవాలతో ‘మనమూ’ తాదాత్మ్యం చెందుతాం. ఒక చిత్రమైన సహానుభూతిని పొందుతాం.
కొన్ని జ్ఞాపకాలను వర్తమాన అనుభవ స్థితికి ముడివేసుకుని అన్వేషించడం స్వేచ్చ కవితల్లో కనిపించే ఒక లక్షణం. దుఃఖపు దుప్పటి, రక్తపు ముసురు, కన్నీటిపూలు, గాలిపూల తోటలు, పసితనపు సంద్రం, గాయపు రంగులు, నల్లటిగాలి జలపాతపు గొంతు, రంగులేని రక్తపు జలపాతాలు, గాలి ఆకుల ఎదురు చూపులు, కుళ్ళిన రెప్పల శవాలు, గాలి గాయాలు, ఉద్వేగపడుతున్న కంటి అల, రాతిముడి, ముడతపడిన మబ్బుల ననల, రంగుల సముద్రం లాంటి అభివ్యక్తితో స్వేచ్చ కవిత్వం మనలను ఆకర్షిస్తుంది. నూతన వ్యక్తీకరణ తన సంవేదనల తీవ్రతవల్లనే ఏ కవికైనా సాధ్యమవుతుంది. స్వేచ్చ కవిత్వం ఉద్వేగ ప్రధానం. సంవేదనలు ప్రచండం. కాబట్టే చప్పున మనసుకు పడతాయి. ఎక్కువ సందర్భాల్లో స్వేచ్చ కవిత్వంలో వ్యక్తం చేసిన అనుభవాలతో ‘మనమూ’ తాదాత్మ్యం చెందుతాం. ఒక చిత్రమైన సహానుభూతిని పొందుతాం.© 2017,www.logili.com All Rights Reserved.