కామంతో కన్నారో... ప్రేమతో కన్నారో తెలియక ప్రసూతి ఆసుపత్రుల్లో ఉన్న బాలింతలంతా ఒళ్లల్లో ఉన్న పసిపిల్లల్ల్ని చూసి అయ్యో.. అయ్యో తెలియక తప్పుగా కన్న ఈ పసిపాపల.. భవిష్యత్తేంటి అని హృదయ విదారకంగా రోదిస్తుంటారు. నిరాయుధులయిన సగటు మనుషులు జీవితంలో ఓడిపోతారు. పోలీసు స్టేషన్లలో ఓడిపోతారు. కోర్టుల్లో ఓడిపోతారు. కానీ డబ్బున్న వాళ్ళందరినీ ఓడించి పోటీలుపడుతూ మరీ ఒక్క చావు దగ్గర మాత్రం విజయవంతంగా గెలుస్తారు.
ప్రభుత్వాల మీద ఉమ్మేస్తూ, ప్రభుత్వాలమీద దుమ్మెత్తిపోస్తూ, భవిష్యత్తు మీద ఏమాత్రం ఆశలేని యువతీ యువకులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకొని మరీ దేశంలో ఆఖరి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. భవిష్యత్తులో మరెప్పుడూ మరో బుద్ధుడు పుట్టకుండా ఉండేందుకు అన్ని ప్రభుత్వాలు కలిసి బోధి వృక్షాలన్నిటినీ నరికించి వేలంపాటు పెట్టి మరీ పొయ్యిలో కట్టెలకు బహిరంగ మార్కెట్లో కారుచవుకగా అమ్మేస్తారు. ఈరోజు ఇంతమంది ప్రజలు విజయవంతంగా చచ్చారు. రేపు ఇంతమంది ప్రజలు విజయవంతంగా చావబోతున్నారు అని ప్రెస్ మీట్లలో ప్రజలేన్నుకున్న నాయకులు గర్వంగా చెప్పుకోవటమే ఈ దేశపు దేశప్రగతి అవుతుంది.
కామంతో కన్నారో... ప్రేమతో కన్నారో తెలియక ప్రసూతి ఆసుపత్రుల్లో ఉన్న బాలింతలంతా ఒళ్లల్లో ఉన్న పసిపిల్లల్ల్ని చూసి అయ్యో.. అయ్యో తెలియక తప్పుగా కన్న ఈ పసిపాపల.. భవిష్యత్తేంటి అని హృదయ విదారకంగా రోదిస్తుంటారు. నిరాయుధులయిన సగటు మనుషులు జీవితంలో ఓడిపోతారు. పోలీసు స్టేషన్లలో ఓడిపోతారు. కోర్టుల్లో ఓడిపోతారు. కానీ డబ్బున్న వాళ్ళందరినీ ఓడించి పోటీలుపడుతూ మరీ ఒక్క చావు దగ్గర మాత్రం విజయవంతంగా గెలుస్తారు. ప్రభుత్వాల మీద ఉమ్మేస్తూ, ప్రభుత్వాలమీద దుమ్మెత్తిపోస్తూ, భవిష్యత్తు మీద ఏమాత్రం ఆశలేని యువతీ యువకులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకొని మరీ దేశంలో ఆఖరి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. భవిష్యత్తులో మరెప్పుడూ మరో బుద్ధుడు పుట్టకుండా ఉండేందుకు అన్ని ప్రభుత్వాలు కలిసి బోధి వృక్షాలన్నిటినీ నరికించి వేలంపాటు పెట్టి మరీ పొయ్యిలో కట్టెలకు బహిరంగ మార్కెట్లో కారుచవుకగా అమ్మేస్తారు. ఈరోజు ఇంతమంది ప్రజలు విజయవంతంగా చచ్చారు. రేపు ఇంతమంది ప్రజలు విజయవంతంగా చావబోతున్నారు అని ప్రెస్ మీట్లలో ప్రజలేన్నుకున్న నాయకులు గర్వంగా చెప్పుకోవటమే ఈ దేశపు దేశప్రగతి అవుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.